తాగుడుకు బానిసై కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నాడని తండ్రిని కుమారుడు కారుతో ఢీకొట్టి హత్య చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం దేవునితండాలో సోమవారం చోటు చేసుకుంది.
చందుర్తి, : తాగుడుకు బానిసై కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నాడని తండ్రిని కుమారుడు కారుతో ఢీకొట్టి హత్య చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం దేవునితండాలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జటోతు తిరుపతి (43) తాగుడుకు బానిసయ్యారు. తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడేవారు. మూడు రోజుల క్రితం ఇంట్లో ఉన్న రూ.పది వేలు తీసుకెళ్లారు. సోమవారం వచ్చి మళ్లీ డబ్బులు కావాలని భార్య అమీనాతో గొడవకు దిగారు. ఆమె ఈ విషయాన్ని తమ కుమారుడు రాజేశ్కు ఫోన్లో తెలిపింది. కారులో వచ్చిన రాజేశ్.. ఇంటి ముందు తల్లితో గొడవ పడుతున్న తండ్రిని కారుతో ఢీకొట్టారు. తీవ్ర గాయాలపాలైన తిరుపతిని స్థానికులు 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారు. ఈ మేరకు మృతుడి అన్న రాములు నాయక్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
మరోవైపు తిరుపతిపై గతంలో చందుర్తి ఠాణాలో మూడు కేసులు ఉన్నట్లు తెలిసింది.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025