July 1, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Crime

టీడీపీ తరఫున ఇఫ్తార్ విందు ఇచ్చారని దాడి

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో తెదేపా కార్యకర్తలు, సానుభూతిపరులపై వరుస దాడులు చోటుచేసుకుంటున్నాయి.

పల్నాడు జిల్లాలో ఘటన
రెంటచింతల, న్యూస్టుడే: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో తెదేపా కార్యకర్తలు, సానుభూతిపరులపై వరుస దాడులు చోటుచేసుకుంటున్నాయి. రెండు రోజుల కిందట సిద్ధం సభకు రాలేదని తెదేపా సానుభూతిపరుడు, ఎస్టీ యువకుడిపై దాడి చేసిన ఘటన మరువకముందే మరోసారి వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయారు. రెంటచింతల మండలం తుమ్మకోటలో ఈ నెల 5న తెదేపా కార్యకర్త పఠాన్ జలీలాఖాన్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా కూటమి అభ్యర్థి బ్రహ్మారెడ్డిని పిలిచారు. విందు తర్వాత ఎన్నికల ప్రచారం సైతం నిర్వహించారు. దీంతో స్థానిక వైకాపా నాయకులు జలీల్పై కక్ష పెంచుకున్నారు. శుక్రవారం గ్రామంలోని మసీదు సమీపంలో అరుగుపై కూర్చుని మాట్లాడుతున్న జలీల్ఫాన్పై అయిదుగురు వ్యక్తులు దాడి చేశారు. ‘ఊరిలోకి తెదేపా నాయకులను పిలుస్తావా? వారికి ఇఫ్తార్ విందు ఇస్తావా?’ అంటూ కర్రలతో కొట్టారు. ఈ ఘటనలో జలీలా ఖాన్కు, ఘటన సమయంలో పక్కనే ఉన్న ఆయన స్నేహితుడు చాంద్ బాషాల తలలకు బలమైన గాయాలయ్యాయి. వారిని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితులను బ్రహ్మారెడ్డి పరామర్శించారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు మసీదు వీధిలో దుకాణాలన్నింటినీ మూయించారు.

Also read

Related posts

Share via