ఇంకో కొన్ని గంటల్లో పెళ్లి.. వరుడికి వధువు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. మరో యువకుడుతో వధువు జంప్ అయింది. మరో ఐదు గంటల్లో తాళి కట్టాల్సి ఉండగా.. పెళ్లికూతురు మాయం అయింది. చివరికి ఏం జరిగిందంటే?
మరో ఐదు గంటల్లో తాళి కట్టాల్సి ఉండగా.. పెళ్లికూతురు మాయం అయింది. కళ్యాణ మండపం నుంచి పెళ్లికూతురు వెళ్ళిపోయింది. మరో యువకుడుతో బయటికి వెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. ముహూర్తం రోజు అర్ధరాత్రి వరకు తాంబూలం కార్యక్రమంలో వధూవరులు చురుగ్గా పాల్గొన్నారు. ఆ తర్వాత అంటే తెల్లవారుజామున 4 గంటలకు పెళ్లికూతురు జంపు కావడంతో పెళ్లి ఆగిపోయింది
కర్నూలు జిల్లా పత్తికొండలో కొన్ని గంటలలో జరగవలసిన పెళ్లి ఆగిపోయింది. అనంతపురంకి చెందిన నరేంద్ర కుమార్ కుమార్తె వైష్ణవికి, కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామానికి చెందిన బజారి కుమారుడు విశ్వాసికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. తెల్లవారితే పెళ్లి, రాత్రి సంప్రదాయాల ప్రకారం చిన్నతంబులం,పెద్ద తాంబూలం కూడా చేశారు. అయితే అమ్మాయికి ఇష్టం లేకపోవడంతో నాలుగు గంటలకు గోపాల్ ప్లాజా కళ్యాణ మండపం నుండి వెళ్లిపోయింది. కొన్ని గంటలలో జరగాల్సిన పెళ్లి నిలిచిపోయింది. పెళ్లి నిలిచిపోవడంతో పెళ్లి కుమార్తె తండ్రి కన్నీరు మున్నీరయ్యారు. పత్తికొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు కళ్యాణ మండపం నుండి ఒక అబ్బాయితో వెళ్ళిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. జరగాల్సిన పెళ్లి ఒక్కసారిగా నిలిచిపోవడంతో అటు పెళ్లికూతురు ,ఇటు పెళ్లి కుమారుడు బంధువులు నిరుత్సాహ గా ఉండిపోయారు. ఏమైనా ఉంటే పెళ్లికి ముందే చూసుకోవాలని ఇలా పెళ్లి ఆపడం మంచిపద్దతి అబ్బాయి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025