పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ప్రియుడు మొహం చాటేయడంతో ప్రియురాలు అతని ఇంటి ముందు ధర్నాకు దిగింది. అతడినే పెళ్లి చేసుకుంటానని భీష్మించుకు కూర్చుంది.
నువ్వు నాకు నచ్చావు అన్నాడు, నువ్వు లేక నేను లేనని మాయ మాటలు చెప్పాడు. మోజు తీరిన తరువాత మాట మార్చాడు. పెళ్లి పేరు చెప్పగానే.. దాటవేస్తున్నాడు. దీంతో.మోసపోయిన ప్రియురాలు ప్రియుడు ఇంటి ఎదుట బైఠాయించింది.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామానికి చెందిన అనిల్, అదే గ్రామానికి చెందిన ప్రత్యూష పరిచయం ఏర్పడింది. తరువాత ఈ పరిచయం.. ప్రేమ గా మారింది. నాలుగేళ్లుగా ఈ ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది. ప్రత్యూషకు అనిల్ పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. ఆ తర్వాత శారీరకంగా కలిశారు. మోజు తీరిన తరువాత పెళ్లి మాట ఎత్తేసరికి ముఖం చాటేస్తున్నాడు. ఎన్ని సార్లు అడిగిన సమాధానం రావడం లేదు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ ప్రత్యూష.. ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించింది. ఈ యువతి ఆందోళనకు మహిళా సంఘాలు గ్రామస్తులు మద్దతు పలుకుతున్నారు. అయితే అనిల్ ఇంటికి తాళం వేసి, పరారీలో ఉన్నాడు. ప్రత్యూషకు న్యాయం జరిగే వరకూ దీక్ష విరమించేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు మహిళా సంఘాలు, గ్రామస్తులు. తనకు న్యాయం చేసే వరకు ఆందోళన కొనసాగిస్తానని స్పష్టం చేశారు.. అతనినే పెళ్లి చేసుకుంటానని.. లేదంటే ఇక్కడి నుంచి కదలనని చెబుతుంది యువతి
Also read
- నేటి జాతకములు..24 జనవరి, 2026
- Crime News: ఎంతకు తెగించార్రా.. ఆ పని తప్పని చెప్పిన పాపానికి.. ఇంతలా వేధిస్తారా?
- దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్ సూసైడ్! ముగ్గురు మృతి
- Crime News: ఎవడు మమ్మీ వీడు.. ప్రేయసి ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు.. ఎందుకో తెలిస్తే
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..





