ఓ దొంగ అర్ధరాత్రి ఎవరూ లేని సమయం చూసి.. సీసీ కెమెరాలకు కూడా చిక్కకుండా దొంగతనం చేసేందుకు ఒక ప్రాంతానికి వచ్చాడు. ఇక అక్కడ మనోడికి డబ్బు కనిపించలేదు, నగలు కనిపించలేదు.. మరే వస్తువులు కనబడలేదు. మరి ఏం దొంగతనం చేశాడంటే..
దొంగోడికి చెప్పే లాభం అనే సామెత ఇలాంటి దొంగతనాల వల్లే పుట్టి ఉంటుంది. దొంగతనానికి వచ్చిన వ్యక్తికి ఏం దొరక్కపోవడంతో చెప్పులు ఎత్తుకెళ్లాడు. దొంగతనానికి వచ్చి ఊరికే వెళ్లడం ఎందుకని అనుకున్నాడో.. ఏమో కానీ.. చెప్పులు చేత పట్టుకుని వెళ్లిపోయిన దొంగ వీడియోలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇదంతా సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలో రాత్రి వేళల్లో దొంగల బెడదతో ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు. గత కొంతకాలంగా మున్సిపల్ వీధుల్లో ఇంటి బయట విలువైన వస్తువులు, ఇతర సామగ్రిలు మాయమవుతున్నాయి. పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఇక్కడ నివసిస్తుంటారు. మరి దొంగతనాలు ఎవరు చేస్తున్నారో గుర్తించలేని పరిస్థితి నెలకొంది. గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిర్వహణ లేక, అవి కొన్ని చోట్ల సరిగ్గా పని చేయడం లేదు. దానికి తోడుగా పోలీసులు నిఘా లేకపోవడంతో అదునుగా భావించిన దుండగులు మంగళవారం రాత్రి ఓ ఇంటి ఆవరణలో సంచరిస్తుండగా సీసీటీవీలో రికార్డ్ అయింది. అయితే ఆ ఇంట్లోకి దొంగతనానికి వెళ్లిన దొంగకు ఎంతసేపు వెతికినా ఏమి దొరకకపోవడంతో ఖాళీగా వెళ్లడం ఎందుకని అక్కడే ఉన్న చెప్పులు ఎత్తుకుని వెళ్లాడు. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసిన అందరూ దొంగకు చెప్పే లాభం అనే సామెత కరెక్టేనని అనుకుంటున్నారు
Also read
- Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సైబర్ దాడి కోణం..? ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాక్ చేసి..
- బ్లాక్ బాక్స్ ఏ రంగులో ఉంటుంది..? విమానంలో ఏ భాగంలో ఉంటుంది..? ఇది గ్రూప్1 ప్రిలిమ్స్ ప్రశ్న
- తొలిసారి భారత్‌లో మొదలైన బ్లాక్‌బాక్స్ డీకోడింగ్ ప్రక్రియ.. ఏ ఒక్క క్లూని వదలని దర్యాప్తు సంస్థలు!
- విమాన శిథిలాల్లో దొరికిన కీలక క్లూ.. DVRను విశ్లేషించనున్న FSL బృందం
- ఎయిరిండియా విమానం కూలిపోవడానికి కారణాలివేనా.? షాకింగ్ విషయాలు చెప్పిన అమెరికా నిపుణులు