కారులో ఆడుకుంటున్న బాలుడు డోర్ లాక్ పడి ఊపిరాడక మృతి చెందిన విషాద ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
నంద్యాల జిల్లా డోన్ లో విషాదం
డోన్ : కారులో ఆడుకుంటున్న బాలుడు డోర్ లాక్ పడి ఊపిరాడక మృతి చెందిన విషాద ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. డోన్ మండలం దొరపల్లె గ్రామానికి చెందిన మోహన్, ధనలక్ష్మి దంపతుల మూడో కుమారుడు ఈశ్వర్(11) బుధవారం మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత ఆడుకోవడానికి బయటికి వెళ్లాడు. ఇంటి ఆవరణలో నిలిపి ఉంచిన బంధువుల కారులోకి ఎక్కగానే ఒక్కసారిగా డోర్ లాక్ పడింది. కారు లాక్ తెరవడం రాక, చాలాసేపు కాళ్లతో చేతులతో అద్దాలను పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. అద్దాలు పగలకపోవడంతో ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈశ్వర్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. సుమారు మూడు గంటల తర్వాత బాలుడు కారులో ఉన్నట్లు గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుమారుడి మరణంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
Also read
- బ్రహ్మపుత్ర నదిలో పడి జమ్మలమడుగు యువతి మృతి
- కళ్లల్లో కారం చల్లి… కత్తులతో నరికి… RMP డాక్టర్ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్..!
- Video: రీల్స్‌తో వివాదం.. రాజీనామా చేసిన ప్రభుత్వ టీచర్! కన్నీళ్లు పెట్టుకుంటూ..
- ఇంకా దొరకని రాము.. నీతు.. గుండెల్ని పిండేస్తున్న ఘటన..
- Massive Scam: 70 మందికి టోకరా పెట్టిన రిటైర్డ్ టీచర్.. ఏకంగా ఏడు కోట్లు స్వాహా





