SGSTV NEWS
CrimeSpiritualTelangana

Bhadrachalam:భద్రాచలం రామాలయం లో  అపచారం.. సంచులపై అన్యమత ప్రచార స్లోగన్

దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిచెందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో అపచారం చోటు చేసుకోవడం భక్తులను కలవరానికి గురి చేసింది.



భద్రాచలం: దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో అపచారం చోటు చేసుకోవడం భక్తులను కలవరానికి గురి చేసింది.  స్వామివారి శేషవస్త్రాలు కొనుగోలు చేస్తే దేవుడి కటాక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. దేవస్థానం నుంచి హక్కులు పొందిన వ్యాపారి నిర్వహిస్తున్న శేష వస్త్రాల విక్రయ దుకాణంలో ఆదివారం అన్యమత ప్రచార సంచిలో పెట్టి వస్త్రాలు విక్రయించడం భక్తులను ఆందోళనకు గుర్తి చేసింది.

అంజన్న ఆలయం పక్కనే

భక్తులు దైవ దర్శనానికి వచ్చినప్పుడు మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా సీతారాముల వారికి వస్త్రాలను సమర్పిస్తుంటారు. అనంతరం వీటిని సేకరించి అదే ప్రాంగణంలోని ఆంజనేయస్వామి ఆలయం పక్కన విక్రయిస్తుంటారు. ఇందుకు ఓ వ్యాపారి ఏడాదికి రూ.50 లక్షలు ఆలయానికి చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఆ దుకాణంపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అన్యమత ప్రచార సంచులను ఏదో ఒక రూపంలో భక్తులకు అంటగట్టి అపచారం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏం జరిగిందంటే?

ఏపీలోని గుంటూరుకు చెందిన కొందరు భక్తులు ఆదివారం రామయ్యను దర్శించుకుని రూ.1,100 చెల్లించి రెండు చీరలను కొనుగోలు చేశారు. దుకాణంలో పని చేస్తున్న వారు వీటిని రెండు సంచుల్లో పెట్టి భక్తులకు అందించారు. కొద్దిసేపటి తర్వాత ఆ సంచులపై ఉన్న అన్యమత ప్రచార స్లోగన్ చూసి భక్తులు అవాక్కయ్యారు. ఇదేంటని అడిగితే దుకాణదారు నుంచి సరైన సమాధానం రాలేదని, దీంతో తమకు ఎదురైన చేదు అనుభవం గురించి ఆలయ అధికారికి ఫిర్యాదు చేసినట్టు భక్తులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఆలయ సిబ్బంది. దుకాణాన్ని పరిశీలించి అక్కడ కొన్ని సంచులపై అన్యమత ప్రచార స్లోగన్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వాటిని అక్కడి నుంచి తీసేసినట్టు సమాచారం. ఈ విషయమై దుకాణ నిర్వహకులు మాట్లాడుతూ.. తమ వద్ద ఉన్న అన్ని సంచులపై దేవస్థానం చిత్రాలే ఉంటాయని, ఆ సంచులపై అన్యమత స్లోగన్ ఉన్నట్లు తాము చూడలేదని.. అవి ఎలా వచ్చాయో కూడా తెలియదని చెబుతున్నారు. ఆలయ సిబ్బంది మాత్రం ఒకటో రెండో సంచులపై అన్యమత ప్రచార స్లోగన్ ఉ తొలగించామని అవి ఏ విధంగా వచ్చాయో తెలుసుకుంటామని తెలిపారు. ఈఓ రమాదేవి వివరణ కోరేందుకు మీడియా ప్రతినిధులు ఫోన్ ద్వారా సంప్రదించగా.. ఆమె స్పందించలేదు.


Also read

Related posts

Share this