నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి.. కర్కశంగా మారింది. గోరు ముద్దులు తినిపించి.. అల్లారుముద్దుగా పెంచాల్సిన ఆ తల్లి, ఏకంగా కన్న కూతురిని చంపేసింది. కన్న పేగును తెంచి శిశువుకు జన్మనిచ్చిన తల్లి కసాయిగా మరి రెండు నెలల శిశువును బావిలో పడేసి చంపేసింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే సిద్దిపేటజిల్లా అప్పనపల్లి గ్రామంలో సిద్దిపేట రూరల్ గ్రామానికి చెందిన శ్రీమన్, కవిత దంపతులు పనుల నిమిత్తం అప్పనపల్లి గ్రామంలో నివాసం ఉంటూన్నారు. వీరికి రెండు నెలల బాబు ఉన్నాడు. అయితే భర్త శ్రీమాన్ పని నిమిత్తం మిరుదొడ్డికి వెళ్ళగా, ఏం జరిగిందో తెలియదు కానీ, కవిత తన రెండు నెలల శిశువును బావిలో పడేసి చంపేసింది. మళ్ళీ తన బాబును ఎవరో బైక్పై వచ్చి ఎత్తుకెళ్లారంటూ ఓ డ్రామాకు తెరలేపింది. చివరికి రంగంలోకి దిగిన పోలీసులు అసలు గుట్టురట్టు బయటపెట్టారు.
భర్త వచ్చాక బాబు కనపడటం లేదు అని, భార్యాభర్తలు దుబ్బాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న క్రమంలో కవితపై అనుమానం వచ్చిన పోలీసులు కవితను గట్టిగా నిలదీయడంతో బాబును చంపి బావిలో పడవేసినట్లు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఈ విషయంను గోప్యంగా ఉంచి సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని గ్రామస్థుల ఆధ్వర్యంలో బాలుడి శవాన్ని బావిలో నుండి బయటకు తీశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో చూసిన వారంతా కంటతడి పెడుతున్నారు.
కన్నతల్లి కడతెరిచి కట్టుకథ అల్లి చెబుతోందని, దీని వెనక కథ ఎంత ఉందో అన్న విషయాలను ఆరా తీసేందుకు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఏది ఏమైనా కన్నబిడ్డను తల్లి చంపిందనే విషయం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది.
Also Read
- Telangana: అయ్యో దేవుడా.. పెళ్లైనా 6 నెలలకే ఇంత దారుణమా.. శాడిస్ట్ భర్త వేధింపులతో..
- Delhi Blast: కారు ఓనర్ పుల్వామా నివాసి.. ఢిల్లీ పేలుడు కేసులో సంచలన విషయాలు..
- Delhi Blast: అల్ ఫలా యూనివర్సిటీ నీడలో టెర్రరిస్టులు.. మొత్తం ఆరుగురు డాక్టర్లు అరెస్ట్!
- ఢిల్లీ కారు పేలుడు కేసులో కీలక పురోగతి.. డాక్టర్లుగా పని చేస్తూ.Delhi blast Latest updates
- Delhi Blast: ఎర్రకోట దగ్గర పార్కింగ్లో 3 గంటలు వెయిటింగ్.. ఆ సూసైడ్ బాంబర్ ఇతనే..





