December 20, 2024
SGSTV NEWS
CrimeTelangana

భర్త అత్యాచారం చేశాడని భార్య ఫిర్యాదు.. కట్ చేస్తే.. కూతురి స్టేట్‌మెంట్‌తో ఊహించని ట్విస్ట్

కన్న తండ్రి తన పైన అత్యాచారం చేశాడని తల్లికి చెప్పుకుంది మైనర్ బాలిక. వెంటనే పోలీసులను ఆశ్రయించి భర్తపై ఫిర్యాదు చేసింది. 2023 సెప్టెంబర్‌లో బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు సంవత్సరం పాటు అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత నిoధితుడికి కోర్టు శిక్ష విధించింది.


2023 సెప్టెంబర్‌లో బండ్లగూడలో నివాసం ఉంటున్న నిందితుడు తన ముగ్గురు పిల్లలు భార్యతో పాటు జీవిస్తున్నాడు. ఇదే తరుణంలో తన భార్య వేరే పని కోసం బయటికి వెళ్ళటంతో తన ఇంట్లో ఉన్న ముగ్గురు పిల్లలో పెద్ద కూతురిపై కన్నతండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని కూతురిని బెదిరించాడు. అయినా సరే తన తల్లి ఇంటికి తిరిగి వచ్చిన తరువాత జరిగిన విషయం మొత్తాన్ని కూతురు తల్లితో చెప్పింది. వెంటనే కూతురుని తీసుకొని బండ్లగూడ పోలీస్ స్టేషన్కు వెళ్లిన తల్లి.. భర్తపై ఫిర్యాదు చేసింది. బండ్లగూడ పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్టు చేశారు.

పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశాక తనను బెయిల్‌పై విడుదల చేయాలని అనేకసార్లు కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ కోర్టు వాటిని పరిగణలోకి తీసుకోలేదు. నిందితుడు బయటికి వస్తే తన కూతురుని భార్యను ప్రభావితం చేస్తాడు కనుక బెయిల్ ఇవ్వద్దు అంటూ పోలీసులు వాదించారు. దీంతో సంవత్సరం నుండి నిందితుడు జైల్లోనే ఉంటున్నాడు. అయితే అనుహ్యంగా కోర్టు తొలి తీర్పు ప్రకటిస్తున్న తరుణంలో కన్నతల్లి తన భర్తపై జాలి చూపించింది. ఇచ్చిన కంప్లైంట్‌ను వెనక్కి తీసుకునేందుకు కూతురుపై ఒత్తిడి తెచ్చింది. తన తల్లి ఎంత చెప్పినా సరే కూతురు మాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్ళింది.


తనపై అఘాయిత్యానికి పాల్పడింది తన కన్న తండ్రి అని స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో పాటు కేసుకి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ అన్నింటిని పరిశీలించిన తర్వాత నాంపల్లి 7 వ అడిషనల్ సెషన్స్ జడ్జ్ అనిత తీర్పు వెల్లడించింది. నిందితుడైన కన్నతండ్రికి జీవిత కారాగార శిక్షతోపాటు ఆరువేల రూపాయల జరిమానా విధించింది. దీంతోపాటు ధైర్యంగా ముందుకు వచ్చి అఘాయిత్యానికి పాల్పడింది అని తెలిసినా.. ఎక్కడా వెనకడుగు వేయకుండా ఫిర్యాదు చేసినందుకు బాధితురాలికి 5 లక్షల రూపాయల పరిహారాన్ని కోర్టు ప్రకటించింది. ప్రస్తుతం బాధితురాలు హోమ్ కేర్‌లో ఉంటూ ఎనిమిదో తరగతి చదువుతుంది

Also read

Related posts

Share via