జగిత్యాల జిల్లాలో అమానుష ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 300 రూపాయల కోసం ఓ వ్యక్తి బలయ్యాడు. జగిత్యాల మండలం పొలాస శివారులో ఆదివారం (సెప్టెంబర్ 14) ఆటోడ్రైవర్ నయీముద్దీన్ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.పోలీసులు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ హత్యకు సంబంధించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.
ఆటో కిరాయి విషయంలో నెలకొన్న వివాదం కారణంగానే బీహార్కు చెందిన దర్శన్ సాహ్ని, సునీల్ సాహ్ని అనే ఇద్దరు నయిముద్దీన్ను అత్యంత పాశవికంగా కొట్టి చంపినట్టు డీఎస్పీ రఘు చందర్ తెలిపారు. నిందితులిద్దరూ హైదర్పల్లి శివారులోని శ్రీ మణికంఠ రైస్ మిల్లులో కూలీలుగా పని చేస్తున్నట్లు గుర్తించారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించినట్లుగా తెలిపారు. 24 గంటలు గడవక ముందే నిందితులను పట్టుకొని రిమాండ్ చేసిన రూరల్ పోలీసులను DSP ప్రత్యేకంగా అభినందించారు
Also read
- భార్యను నమ్మించి మదనపల్లి లాడ్జ్కి తీసుకొచ్చాడు.. రాత్రి వరకు కలిసే ఉన్నారు.. తెల్లవారుజామున బాత్రూంలో..
- భర్తను లేపేసి లవర్తో కలిసి హైదరాబాద్కు జంప్.. సినిమాను మించిన ట్విస్టులు
- Telangana: బిర్యానీ తిని యువకుడు మృతి.. 15 మందికి అస్వస్థత
- అరేయ్ ఏంట్రా ఇది.. మటన్ బిర్యానీలో పుచ్చిపోయిన పన్ను.. అసలేం జరిగిందంటే..
- మానవత్వాన్ని ప్రశ్నిస్తున్న ఘటన.. తాత మృతదేహం ముందే ఆస్తి పంచాయితీ!





