పటాన్ చెరువు. కుటుంబ కలహాలు రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. భార్యాభర్త వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఐలాపూర్ చిన్న తండాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లాకు చెందిన లాల్ శేఖర్ (32) తన భార్య అనూషతో కలిసి రెండేళ్లుగా ఐలాపూర్ చిన్న తండాలో దోబీ పని చేసుకుంటూ ఉండేవారు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఆదివారం కూడా భార్యాభర్త మధ్య గొడవ జరిగింది. దీంతో అనూష సమీపంలో ఉండే తల్లిగారింటికి వెళ్లిపోయింది. సోమవారం తన పుట్టింట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త లాల్ శేఖర్ వెళ్లి తలుపు పగలగొట్టి వెళ్లి చూడగా అప్పటికే ఆమె ప్రాణాలు విడిచింది. దీంతో తనకు ఏం జరుగుతుందోనని ఆందోళనతో తానుండే ఇంటికి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లాల్ శేఖర్, అనూష మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు తెలిపారు.
Also Read
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..
- ఇన్‌స్టాలో పరిచమయ్యాడు.. తర్వాత ఇంటి నుంచి తీసుకెళ్లాడు.. కట్‌చేస్తే.. 3 నెలల తర్వాత..





