నిడదవోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరుల పెన్ డౌన్ ఆందోళన కు సి.పి.ఐ.యం.యల్ ( న్యూ డెమోక్రసీ పార్టీ) నాయకులు ఈమని గ్రీష్మ కుమార్ సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా ధర్నానుద్దేశించి గ్రీష్మ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో 5 లక్షలమంది ప్రత్యక్షంగా ను, 3 లక్షలమంది పరోక్షంగా ను ఉపాధి కోల్పోయి రోడ్డున పడే విధంగా కూటమి ప్రభుత్వం జి.ఓ నెంబర్ 396 ద్వారా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు ద్వారా దొడ్డి దారిన రిజిస్ట్రేషన్ శాఖ ను ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి మొత్తం రిజిస్ట్రేషన్ శాఖ ను ప్రయివేటీకరణ కు తెరతీసిందనీ తక్షణమే జీఓ నెంబర్ 396 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సదరు జీఓ నెంబర్ 396 వలన ప్రజలు తమ ఆస్తుల కు రక్షణ , భరోసా ప్రమాదం ఉన్నందున ప్రజల ఆందోళనను, ప్రజాభిప్రాయాన్ని గౌరవించి తమది ప్రజా సంక్షేమ ప్రభుత్వం అనే చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు.
పై కార్యక్రమంలో దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ వాసా వెంకట సురేష్, సెక్రటరీ కూచిభట్ల ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ చలపతి, పెమ్మరాజు రాజాజీ, మణికంఠ, లక్ష్మి, త్రిమూర్తులు, హల్లెలూయ, ఝాన్సి, ఐ.యఫ్.టి.యు నాయకులు మల్లిడి వెంకట రామిరెడ్డి తదితరులు నాయకత్వం వహించారు.
Also read
- అప్పుల బాధ తాళలేక.. గోదావరిలోకి దూకిన కుటుంబం
- సోషల్ మీడియా లో పరిచయం.. మాయమాటలతో వల
- చున్నీతో చేతులు కట్టేసి.. నోట్లో రుమాలు కుక్కి..
- బచ్చలకూర అనుకుని పప్పులో గన్నేరాకు వేసి
- ‘సారీ రాధికా.. గుడ్‌బై’.. భార్య పుట్టినరోజు నాడే హైదరాబాద్ టెకీ ఆత్మహత్య





