SGSTV NEWS online
CrimeTelangana

చున్నీతో చేతులు కట్టేసి.. నోట్లో రుమాలు కుక్కి..





సంగారెడ్డి అర్బన్: ఇద్దరు యువకులు ముఖాలకు మాస్కులు ధరించి.. కళాశాలలోకి ప్రవేశించి విద్యార్థినిపై దాడి చేసిన ఘటన సంగారెడ్డిలో గురువారం జరిగింది. పట్టణ సీఐ రామునాయుడు తెలిపిన ప్రకారం… పుల్కల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని(19) సంగారెడ్డి ప్రభుత్వ (తారా) డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె గురువారం కళాశాలకు వచ్చింది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ముఖాలకు మాస్కులు ధరించి కళాశాలలోకి ఇద్దరు యువకులు ప్రవేశించారు. రెండో అంతస్తుకు చేరుకుని విద్యార్థినిపై దాడి చేయడంతో, పరుగు తీస్తూ మూడో అంతస్తులోకి వెళ్లింది.

విషయాన్ని తండ్రికి చెప్పేందుకు ఫోన్ చేస్తుండగా.. అక్కడే ఆమెను అడ్డగించి చున్నీతో చేతులు కట్టేసి, రుమాలును నోట్లో కుక్కి ఫోన్ తీసుకున్నారు. ఈ ఘటనను వీడియో, ఫొటోలు తీసి ఆమె ఫోన్ నుంచే విద్యార్థిని తండ్రికి పంపించి అక్కడి నుంచి పరారయ్యారు. విద్యార్థిని తండ్రి వెంటనే వాటిని పోలీసులకు పంపించారు.విద్యార్థిని కళాశాల మూడో అంతస్తులో ఉన్నట్లు గుర్తించి అందరూ అక్కడికి వెళ్లారు. అప్పటికే ఆమె స్పృహ తప్పి పడిపోయి ఉండడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె ప్రస్తుతం క్షేమంగా ఉందని సీఐ వివరించారు.

వేడుకున్నా.. వెంటపడి…

బాధిత విద్యార్థినికి చెందిన ఫోన్ను వేరేవారు తీసుకుని దాని నుంచి అసభ్యకర వీడియోలను దాడి చేసిన ఇద్దరు యువకుల్లో ఒకరికి పంపారు. ఈ ఘటనతో పది రోజులుగా ఆమె ఆచూకీ కోసం అతను ప్రయత్నిస్తున్నాడు. చివరకు కళాశాలకు చేరుకుని దాడి చేస్తుండగా.. తన తప్పు లేదని, ఇతరులు చేశారని విద్యార్థిని వేడుకున్నా ఆ యువకుడు పట్టించుకోలేదని పోలీసువర్గాలు తెలిపాయి. నిందితుల కోసం గాలిస్తున్నామని, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని సీఐ చెప్పారు.

Also read

Related posts