రోజు స్కూలుకి వెళ్లి వచ్చే తన చిట్టి తల్లి కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు తండ్రి. స్కూల్ బస్సు ఆగింది. బస్సు నుంచి ఆ చిట్టితల్లి నవ్వుతూ కిందకు దిగింది. అదే చిరునవ్వుతో నాన్నా అంటూ రోడ్డు దాటే ప్రయత్నం చేసింది. ఇంతలో దిగిన బస్సే ఆ చిన్నారిని ఢీకొంది. ఆ చిట్టి తల్లి ప్రాణం విలవిల్లాడుతూ అక్కడికక్కడే ఊపిరి వదిలింది. తండ్రి కళ్ళముందే జరిగిన ఈ ఘటన ఆ కుటుంబానికి తీరని శ్లోకాన్ని మిగిల్చింది. దీంతోపాటూ అక్కడి గ్రామస్తులను తీవ్రంగా కలచివేసింది.
విశాఖ జిల్లా భీమిలి మండలం మజ్జివలస గ్రామానికి చెందిన బంటుపల్లి సురేష్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మూడేళ్ల ఆద్య పద్మనాభం మండలం రెడ్డిపల్లిలోని పాఠశాలలో ఎల్కేజీ చదువుతోంది. రోజూ నవ్వుకుంటూ స్కూల్‌కి వెళ్లి తిరిగి చిరునవ్వుతో వచ్చి తల్లిదండ్రులను పలకరించేది. రోజు మాదిరిగానే శనివారం ఉదయం స్కూల్‌కి చలాకీగా వెళ్ళింది. స్కూలు ముగిసిన తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి స్కులు బస్సులో ఇంటివద్దకు చేరుకుంది. ఆద్య కోసం తండ్రి సురేష్ అవతలి రోడ్డులో వేచి చూస్తున్నాడు. తానే స్వయంగా ఇంటికి తీసుకెళ్లెందుకు బస్ స్టాప్ వద్దకు చేరుకున్నాడు. అప్పుడే బస్సు వచ్చింది బస్సు లోపల నుంచి తండ్రిని చూసి చేయి ఊపింది ఆద్య.
బస్సు దిగిన ఆద్య అవతలి రోడ్డులో ఉన్న తండ్రిని చిరునవ్వుతో పలకరించింది. బ్యాగు తగిలించుకొని తండ్రి దగ్గరకు సంతోషంగా పరుగులు తీసింది. బాలిక బస్సు దిగి రోడ్డు దాటిందనుకుని ఆ బస్సును ముందుకు నడిపాడు డ్రైవర్. ఇదే సమయంలో ఆమెను దింపిన స్కూల్ బస్సు.. ఆద్యను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ చిట్టి తల్లి విలవిలాడుతూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. దీంతో ఆ తండ్రి గుండెలు పట్టుకున్నాడు. విషయం తెలిసి తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. గ్రామమంతా శోక సముద్రంలో మునిగిపోయింది. ఇటువంటి కష్టం దేవుడు ఎవరికి ఇవ్వకూడదని ఆవేదన చెందుతున్నారు స్థానికులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్‌టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





