పటమట(విజయవాడ): అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఐఏఎస్ అధికారి భార్య చికిత్స పొందుతూ అర్ధరాత్రి హఠాత్తుగా మృతి చెందారు. దీనిపై ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు మెడికో లీగల్ కేసు సమాచారం ఇవ్వడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఐఏఎస్ అధికారి జి. కె. కిషోర్ కుమార్ ఏపీ మిషన్ ఫర్ క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ మొగల్రాజపురంలో భార్య సత్య దీపిక(42), ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు.
కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సత్య దీపిక డిసెంబరు 24 నుంచి 27 వరకు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. గొంతు ఇన్ఫెక్షన్ రావడంతో మళ్లీ గత నెల 31న అదే ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 3న తన సోదరి సరితకు ఫోన్ చేసి గొంతు ఇన్ఫెక్షన్ వల్ల మాట్లాడలేకపోతున్నాను. డిశ్చార్జ్ అయిన తర్వాత మీ ఇంటికి వస్తానని చెప్పింది. ఈ క్రమంలో.. చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి 1.20 గంటలకు హఠాత్తుగా మృతి చెందారు.దీంతో ఆసుపత్రి వైద్యులు పటమట పోలీసులకు మెడికో లీగల్ కేసు కింద సమాచారం అందించారు. రిపోర్ట్‌లో కార్డియాక్ అరెస్ట్ లేదా ఇతర కారణాల వల్ల మృతి చెందినట్లు పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఆసుపత్రికి చేరుకుని ఇరు వర్గాలను విచారించగా మృతిపై వారు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. తమకు కేసు అవసరం లేదని తెలిపారు. ఆసుపత్రి మెడికో లీగల్ కేసు కింద ఇంటిమేషన్ ఇచ్చారని కేసు నమోదు చేయాలని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం ఆదివారం సాయంత్రం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు దర్యాప్తు చేస్తున్నట్లు పటమట సీఐ పవన్ కిషోర్ తెలిపారు.
Also Read
- ఆదివారం తులసి మొక్కకు నీరు పోయకూడదని ఎందుకు అంటారు? నిజం తెలుసుకోండి!
- Astro Secrets: మీ రాశిని శాసించే ఆ జంతువు ఏంటో మీకు తెలుసా?.. జ్యోతిష్య శాస్త్రంలో దాగి ఉన్న ఆసక్తికరమైన రహస్యాలివే!
- Weekly Horoscope: వారికి అదృష్టం కలిసి రానుంది..! 12 రాశులకు వారఫలాలు
- నువ్వేం మనిషి అంజయ్య.. అత్తగారు బైక్ కొనిపెట్టలేదని.. భార్యను చంపి..
- రైల్వే స్టేషన్‌కు వెళ్తుండగా విరుచుకుపడ్డ మృత్యువు..భార్య, కొడుకు కళ్లెదుటే భర్త దుర్మరణం! ఏం జరిగిందో చూస్తే..





