రాయదుర్గం, : సెలవులు ముగిశాయి.. బడికి వెళ్లేందుకు సిద్ధం కావాలని తల్లిదండ్రులు చెప్పడంతో అందుకు ఇష్టంలేని ఓ బాలుడు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ కె.బాలరాజు కథనం ప్రకారం.. ఏపీలోని కడప జిల్లా పోరుమామిళ్ల మండం, అక్కలరెడ్డి పల్లె గ్రామానికి చెందిన ఓ కుటుంబం 15 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి గౌలిదొడ్డిలో నివాసం ఉంటోంది. కుటుంబ పెద్ద వాచ్‌మన్‌గా పనిచేస్తోండగా.. ఆయన కుమారుడు (14) చందానగర్ లోని ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. కాగా క్రిస్మస్ సెలవులు ముగిసినా బడికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం తల్లిదండ్రులు సోమవారం నుంచి బడికి వెళ్లేందుకు బ్యాగు సర్దుకుని సిద్ధం కావాలని కుమారుడికి చెప్పారు. ఈ క్రమంలో తల్లి ఇంటి బయట పనిలో నిమగ్నమవగా బాలుడు లోపల ఇంట్లోని రేకుల పైకప్పు రాడ్డునకు ఉరివేసుకున్నాడు. కాసేపటి తర్వాత తల్లి వచ్చి చూసేసరికి మృతి చెంది ఉన్నాడు. తండ్రి ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..
- ఇన్‌స్టాలో పరిచమయ్యాడు.. తర్వాత ఇంటి నుంచి తీసుకెళ్లాడు.. కట్‌చేస్తే.. 3 నెలల తర్వాత..





