March 12, 2025
SGSTV NEWS
Andhra Pradesh

రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్  గుంటూరులో అరండల్  పేట 4/4 శివాలయంలో  ప్రత్యేక పూజలు…*

*రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్  గుంటూరులో అరండల్  పేట 4/4 శివాలయంలో  ప్రత్యేక పూజలు…*

అమరావతి:
గుంటూరు అరండల్ పేటలో ఉన్న శ్రీ హంపి పీఠ పాలిత శ్రీ గంగా మీనాక్షి సోమ సుందరేశ్వర శివాలయంలో రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు శివ దీక్షలో ఉన్న వాసంశెట్టి సుభాష్ బుధవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి రాకను పురస్కరించుకొని దేవాలయంలో పూర్ణకుంభ స్వాగతంతో దేవాలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం మంత్రివర్యులకు  దుస్సాలువ, పూలమాలలు వేసి వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ఏకా ప్రసాదు, ఆలయ అర్చకులు కుందుర్తి సుబ్రహ్మణ్యం, కుందుర్తి శ్రీనివాస్, భాస్కర్ శర్మ, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు, తెదేపా  రాష్ట్ర బ్రాహ్మణ నాయకులు సిరిపురపు శ్రీధర్ శర్మ, స్థానిక డివిజన్ అధ్యక్షులు మర్రిపాటి శ్రీనివాస్, శబరి, చైతన్య,బాజీ,రమేష్ తదితరులు పాల్గొన్నారు

Also read

Related posts

Share via