SGSTV NEWS
Astrology

Weekly Horoscope: ఆ రాశి వ్యాపారులకు అనుకూలత.. 12 రాశుల వారికి రాశిఫలాలు




వార ఫలాలు (జూన్ 1-7, 2025): మేష రాశి వారికి ఈ వారం ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ఉద్యోగులకు మరింత మంచి అవకాశాలు లభిస్తాయి. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. మిథున రాశివారికి ఈ వారమంతా చాలావరకు సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..


మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ఉద్యోగులకు మరింత మంచి అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ వృద్ధి చెందుతుంది. ఒకటి రెండు శుభవార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. విదేశీ అవ కాశాలు కూడా అంది వస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సానుకూలపడుతుంది. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. రావలసిన సొమ్ము కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా, సంతృప్తికరంగా ఉంటాయి.



వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. వారమంతా సుఖ సంతోషాలతో సాగిపోతుంది. కుటుంబ జీవితంలో సామరస్యం పెరుగుతుంది. ఇతరులకు కొద్దిగా ఆర్థిక సహాయం అందిస్తారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు బాగానే పెరుగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆక స్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

శుభ గ్రహాల అనుకూలత వల్ల ఈ రాశివారికి ఈ వారమంతా చాలావరకు సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సామం లభిస్తాయి. అధికారులకు మీ సలహాలు, సూచనలు బాగా ఉపయోగ పడతాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూల ఫలితాలనిస్తాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగి పోతుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. చేపట్టిన పనులు, వ్యవహారాలు సకా లంలో సవ్యంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉన్నప్పటికీ, ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల నిర్వహణ అదుపు తప్పుతుంది. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ధశమ స్థానంలో శుక్రుడు, లాభ స్థానంలో బుధ, రవుల సంచారం కారణంగా బాగా అనుకూలంగా, సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. మీ మాటకు విలువ ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగానే ఉంటుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉన్నతస్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు శుభ వార్తలు అందుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరిగే అవకాశం ఉంది. అధికారులు ఎంతో నమ్మకంతో కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. ఒకటి రెండు శుభవార్తలు అందే అవకాశం ఉంది. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవ కాశం ఉంది. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

అనుకోకుండా కొన్ని శుభ పరిణామాలు అనుభవానికి వస్తాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అనారోగ్యాల నుంచి బయటపడే అవకాశముంది. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబ వ్యవహారాలను చక్క బెడ తారు. ఆదాయానికి లోటుండదు. ముఖ్యమైన ఆర్థిక విషయాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కివస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. అనుకోకుండా శుభ వార్తలు వినడం జరుగుతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. పనితీరుతో అధికారులను మెప్పిస్తారు. వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా సాగిపోతాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆదాయ వృద్ది మార్గాలు బాగా విస్తరిస్తాయి. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్య మైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఎదురు చూస్తున్న శుభవార్త అందుతుంది. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థులు ఆశించిన పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. దూరపు బంధువుల్లో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.


వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు పాటించడం ఉత్తమం. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు, పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్యం ఉన్నప్పటికీ ఇంటా బయటా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఉద్యోగంలో పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో డిమాండు బాగా పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయ వద్దు. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో హ్యాపీగా సాగిపోతాయి. నిరుద్యోగులు తగిన ఉద్యోగంలో స్థిరపడడం జరుగుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. 


ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

గురు బలం బాగా పెరిగినందువల్ల మానసిక ప్రశాంతతకు, సుఖ సంతోషాలకు లోటుండదు. సర్వత్రా మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన దాని కంటే ఎక్కువగా పురోగతి ఉంటుంది. ఉద్యోగాల్లో తప్పకుండా అధికార యోగం పడుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. తలపెట్టిన ముఖ్యమైన పనులు, వ్యవహారాలు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. బంధుమిత్రులకు ఆర్థికంగా బాగా సహాయం చేస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి.


మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వారమంతా చాలావరకు సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అదనపు ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఆర్థిక సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలందుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. నిరుద్యోగులకు స్వదేశంలోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.


కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో పని భారం బాగా పెరుగుతుంది. అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. అధికార యోగానికి అవకాశముంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. సమయస్ఫూర్తితో వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి.  కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉండే అవకాశం ఉంది. అదనపు ఆదాయం కోసం పట్టుదలగా ప్రయత్నాలు సాగిస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవు తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. విద్యార్థులకు శ్రమాధిక్యత ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. జీవిత భాగస్వామి సహాయ సహకారాలుంటాయి.


మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అధికారులు కొత్త బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు అందే అవకాశముంది.  వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఇతరుల మీద ఆధారపడకుండా సొంత ఆలోచనలతో వ్యాపారాలను నిర్వహించుకోవడం మంచిది. వివాహ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవ హారాలు సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

Also read

Related posts

Share this