జ్యోతిష శాస్త్రం ప్రకారం 6, 8, 12 స్థానాల అధిపతులు ఒకరి స్థానంలో మరొకరు ఉన్నా, ఎవరి స్థానాల్లో వారున్నా విపరీత రాజయోగం ఏర్పడుతుంది. విపరీత రాజయోగం అంటే జీవితంలో అందలాలు ఎక్కడం, ఏం చేసినా చెల్లుబాటు కావడం, పేరు ప్రఖ్యాతులు కలగడం, ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం, మంత్రులు, ప్రజా ప్రతినిధులు కావడం వంటివి. ప్రస్తుత గ్రహ సంచారం రీత్యా మిథునం, కర్కాటకం, సింహం, కన్య, ధనుస్సు, మకర రాశుల వారికి ఈ యోగం పట్టింది. నెల రోజుల పాటు ఈ రాశుల వారికి ఆడింది ఆటగా
మిథునం
ఈ రాశివారికి 12వ స్థానాధిపతి శుక్రుడు 12వ స్థానంలోనే ఉన్నందువల్ల విపరీత రాజయోగం కలిగింది. ఈ యోగం వల్ల ఈ రాశివారికి కొద్ది ప్రయత్నంతో విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఆదాయం బాగా పెరిగి, ఖర్చులు తగ్గుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అపారంగా లాభిస్తాయి. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఒక ప్రముఖుడిగా గుర్తింపు లభిస్తుంది. చెలామణీ అవుతారు. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది.
కర్కాటకం
ఈ రాశికి ఆరవ స్థానాధిపతి అయిన గురువు 12వ స్థానంలో సంచారం వల్ల విపరీత రాజయోగం కలిగింది. సీనియర్లను కూడా పక్కన పెట్టి ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఒకటి రెండు ధన యోగాలు కలుగుతాయి. ఆస్తి కలసి వచ్చి సంపన్నులు కావడం జరుగుతుంది. ఒక పుర ప్రముఖుడుగా ఎదిగే అవకాశం ఉంది.
సింహం
ఈ రాశికి 6వ స్థానాధిపతి అయిన శని 8వ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి విపరీత రాజయోగం కలిగింది. దీనివల్ల ఈ రాశివారు నిజంగానే ఒక సింహం మాదిరిగా జీవించడం జరుగుతుంది. ప్రభుత్వంలో గానీ, రాజకీయాల్లో గానీ బాగా పట్టు, పలుకుబడి సంపాదించుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. చదువుల్లో సాటి లేని మేటి అనిపించుకుంటారు. అత్యంత ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. తప్పకుండా సంపన్నులవుతారు.
కన్య
అష్టమాధిపతి కుజుడు 12వ స్థానంలో సంచారం వల్ల ఈ రాశివారికి విపరీత రాజయోగం పట్టింది. దీనివల్ల ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా అగ్రస్థానానికి చేరుకుంటారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. దాదాపు అపర కుబేరులయ్యే అవకాశం ఉంటుంది. రాజకీయంగా అందలాలు ఎక్కడం జరుగుతుంది. అతి చిన్న వయసు లోనే సంపాదన ప్రారంభమవుతుంది. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి. రాజకీయాల్లో రాణించే అవకాశం ఉంది.
ధనుస్సు
ఈ రాశికి 6వ స్థానాధిపతి అయిన శుక్రుడు 6వ స్థానంలోనే ఉండడం వల్ల ఈ రాశివారికి మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. భారీ లక్ష్యాలను సైతం సునాయాసంగా పూర్తి చేసి, మంచి గుర్తింపు పొందుతారు. ఉద్యోగంలో తప్పకుండా అందలాలు ఎక్కుతారు. కొద్ది ప్రయత్నంతో విదేశాల్లో ఉద్యోగం సంపాదించుకుని స్థిరపడతారు. వృత్తి, వ్యాపారాల్లో సొంత ముద్ర వేస్తారు. వ్యాపార, వాణిజ్య సంస్థలను నిర్వహించే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది
మకరం
ఈ రాశికి 12వ స్థానాధిపతి అయిన గురువు 6వ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల విపరీత రాజయోగం కలిగింది. ఈ యోగం వల్ల ఈ రాశివారు వృత్తి, ఉద్యోగాల్లో చక్రం తిప్పుతారు. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడడమే కాక, ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందడం జరుగుతుంది. ఆదాయం విశేషంగా అభివృద్ధి చెంది ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా బయట పడతారు. రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అసాధారణ ప్రజ్ఞావంతులవుతారు.
Also read
- నేటి జాతకములు…11 జూలై, 2025
- Hindu Epic Story: స్వర్గాధికధిపతి ఇంద్రుడు ఒళ్ళంతా కళ్ళే.. ఈ శాపం వెనుక పున్న పురాణ కథ ఏమిటంటే..
- Vipareeta Raja Yoga: నెల రోజులు చక్రం తిప్పేది ఈ రాశులవారే..! ఇందులో మీ రాశి ఉందా?
- నా లాగా ఎవరూ మోసపోవద్దు.. కుమారుడు జాగ్రత్త.. అయ్యో అనూష
- Andhra: వదినపై కన్నేసి సెట్ చేశాడు.. కానీ, మరిది అడ్డుగా ఉన్నాడని.. మాస్టర్ స్కెచ్.. చివరకు