వార ఫలాలు (మే 18-24, 2025): మేష రాశి వారికి ఈ వారం ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. వృషభ రాశి వారి ఆదాయంలో అసాధారణ పెరుగుదల ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. మిథున రాశి వారికి పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు కూడా సానుకూలపడతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఇతర సంస్థల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అంది వస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సానుకూలపడుతుంది. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. రాదనుకున్న సొమ్ము కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆర్థికంగా బలం పెరుగుతుంది. ఆదాయంలో అసాధారణ పెరుగుదల ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వారమంతా అనేక విధాలుగా సుఖ సంతోషాలతో సాగిపోతుంది. కుటుంబ జీవితంలో సామరస్యం పెరుగుతుంది. ఒకరిద్దరు బంధుమిత్రులకు వీలైనంతగా ఆర్థిక సహాయం అందిస్తారు. ఆదాయ వృద్దికి ప్రయత్నాలు చేపట్టడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఈ వారమంతా చాలావరకు సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు కూడా సానుకూలపడతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. మీ సలహాల వల్ల అధికారులు బాగా లబ్ధి పొందుతారు. వృత్తి, వ్యాపారాలు పెట్టుబడులకు తగ్గ లాభాలనిస్తాయి. కుటుంబ జీవితం, ప్రేమ జీవితం ఉత్సాహంగా సాగిపోతాయి. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. మంచి పరిచయాలు కలుగుతాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విదేశాల నుంచి ఉద్యోగపరంగా ఆశించిన సమాచారం అందుతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
గురు, శుక్రుల అనుకూలత వల్ల ఈ వారమంతా బాగా అనుకూలంగా, సుఖ సంతోషాలతో సాగి పోతుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి వృద్ది చెందుతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. ఉద్యోగపరంగా శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. వృత్తి జీవితంలో కార్యకలాపాలు విస్తరిస్తాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరిగినప్పటికీ, ఆశించిన ప్రతి ఫలం లభిస్తుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొందరు బంధువుల వల్ల సమస్యలు తలెత్తవచ్చు. ఆర్థిక విషయాల్లో నష్టపోయే సూచనలున్నాయి. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మ వద్దు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అనారోగ్యాల నుంచి ఊరట లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో చిన్నా చితకా సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు దూర ప్రాంత సంస్థ నుంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. తలపెట్టిన పనులలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా సాగిపోతుంది. పిల్లలు చదువుల్లో కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉత్సాహం బాగా పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధాసక్తులు వృద్దిచెందుతాయి. ఆస్తి సమస్య ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. ప్రతిభా పాటవాలు బాగా రాణిస్తాయి. వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా సాగిపోతాయి. సామాజికంగా కూడా ఆశించిన గుర్తింపు తెచ్చుకుంటారు. ఆదాయం బాగా పెరగడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలావరకు బయటపడతారు. ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. రావలసిన సొమ్మును రాబట్టుకుంటారు. మంచి పరిచయాలు కలుగుతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆదాయ వృద్ధికి ప్రయత్నాలు చేపట్టడం మంచిది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. షేర్లు బాగా లాభిస్తాయి. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు, పెండింగ్ పనుల్ని పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి వివాదాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు అదుపుతప్పుతాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వారమంతా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. ఇంటా బయటా మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఉద్యోగాల్లో తప్పకుండా అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. కుటుంబ జీవితం చాలావరకు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. పుణ్య కార్యాల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు. తల పెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులకు ఆర్థికంగా బాగా సహాయం చేస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలందుతాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక లావాదేవీల వల్ల లాభాలు కలుగుతాయి. ధనపరంగా రోజంతా సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పెండింగ్ పనులు పూర్తయి ఊరట లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారులకు బాగా ఉపయోగపడతారు. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు పరిష్కరించుకుంటారు. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి కానీ కొద్దిగా ఒత్తిడి, శ్రమ మాత్రం తప్పకపోవచ్చు. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు సాగిస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. నిరుద్యోగులు సొంత ఊర్లోనే ఉద్యోగ ప్రయత్నాలు సాగించడం మంచిది. ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి ఖాయమయ్యే అవకాశముంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందే అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆదాయ వృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో, సంతృప్తి కరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గే సూచనలున్నాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.
Also read
- తిరుమలలో చిరుత సంచారం.. ఆలయంపై విమానం చక్కర్లు..వీడియో.. అధికారులేమంటున్నారంటే
- నేటి జాతకములు..2 జూన్, 2025
- Bhadrachalam:భద్రాచలం రామాలయం లో అపచారం.. సంచులపై అన్యమత ప్రచార స్లోగన్
- Nellore: వృద్ధుడిని చంపి.. మృతదేహాన్ని బోరుబావిలో వేసి..
- Nellore: అమ్మవారికి దిష్టి తీసిన పూజారి అక్కడికక్కడే మృతి (VIDEO)