SGSTV NEWS
Astrology

దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద



వెలుగుల పండగ దీపావళి రోజున అరుదైన యోగం ఏర్పడుతుందని జ్యోతిష్కులు చెబుతున్నారు. ఈ రోజున నవగ్రహాలకు అధినేత సూర్యుడు.. గ్రహాల రాకుమారుడు బుధుడు, కుజుల కలయిక జరగనుంది. దీంతో శక్తివంతమైన త్రిగ్రహి యోగం ఏర్పడుతుంది.ఈ యోగం మొత్తం 12 రాశులనూ ప్రభావితం చేస్తుంది. కానీ ఈ సమయంలో మూడు రాశుల వారి అదృష్టం ప్రకాశిస్తుంది. వీరు అకస్మాత్తుగా ఆర్థిక లాభం పొందవచ్చు. ఈ రోజు ఈ మూడు అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం

దీపావళి పండగను ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం దీపావళి పండగ అక్టోబర్ 20 న జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈ సంవత్సరం దీపావళి జ్యోతిషశాస్త్ర దృక్పథంలో చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున త్రిగ్రహి యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం గ్రహాలకు రాజు అయిన సూర్యుడు, వ్యాపార కారకుడు అయిన బుధుడు, ధైర్యం, క్రమశిక్షణకు ప్రతీక కుజుడుని ఏకం చేస్తుంది.దీపావళి నాడు తులారాశిలో త్రిగ్రహి యోగం ఏర్పడుతుంది.


ఈ త్రిగ్రహి యోగం మొత్తం 12 రాశుల వారినీ ప్రభావితం చేస్తుంది. అయితే ఈ సమయంలో మూడు రాశుల వారి అదృష్టం ప్రకాశిస్తుంది. వారు అకస్మాత్తుగా ఆర్థిక లాభం పొందవచ్చు. ముఖ్యంగా వ్యాపర రంగంలో ఉన్న వారికి పెట్టుబడుల నుంచి మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. కనుక ఈ రోజు ఆ మూడు అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం?



తులా రాశి: ఈ త్రిగ్రహి యోగం తులా రాశిలో ఏర్పడుతుంది. కనుక ఈ యోగం తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ యోగం లగ్నస్థానమైన తులారాశిలో ఏర్పడుతుంది. తత్ఫలితంగా తులారాశి వారు ఈ సమయంలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని.. సమాజంలో గౌరవాన్ని పొందుతారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయవచ్చు. కష్టపడి పనిచేయడం వల్ల విజయం సాధించవచ్చు.


ధనుస్సు రాశి: ఈ త్రిగ్రహి యోగం ధనుస్సు రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఆదాయం, లాభదాయక ఇంట్లో ఏర్పడుతుంది. తత్ఫలితంగా ఈ సమయంలో ధనుస్సు రాశి వ్యక్తుల ఆదాయం పెరగవచ్చు. కొత్త ఆదాయ వనరులు మార్గాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ధనుస్సు రాశికి చెందిన వ్యాపారస్తులకు ఈ సమయం శుభాసమయం. వ్యాపారంలో కొత్త ఒప్పందాలను చేసే అవకాశం ఉంది.పెట్టుబడుల నుంచి లాభాలను ఆర్జించవచ్చు. లాటరీ , స్టాక్ మార్కెట్ నుంచి లాభం పొందే అవకాశాలు ఏర్పడవచ్చు.


మకర రాశి:దీపావళి రోజున ఏర్పడే ఈ త్రిగ్రహి యోగం వల్ల మకర రాశి వారికి మంచి సమయం ప్రారంభం అవుతుంది. ఈ యోగం మకర రాశి వారి కర్మ భావంలో ఏర్పడుతుంది. అందువల్ల  ఈ సమయంలో మకర రాశి వారు తమ పని, వ్యాపారంలో పురోగతిని పొందనున్నారు. కొత్త వ్యాపార అవకాశాలు లభించవచ్చు. పాత ప్రాజెక్టులు ఊపందుకుంటాయి. ఉద్యోగంలో ఉన్నవారు కోరుకున్న స్థానానికి బదిలీ చేయబడవచ్చు.

Also read

Related posts