భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల పరిస్థితులు కొనసాగుతున్న వేళ సోషల్ మీడియాలో పాకిస్తాన్ కు అనుకూల పోస్ట్ చేసినందుకు ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో శనివారం చోటుచేసుకుంది.
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల పరిస్థితులు కొనసాగుతున్న వేళ సోషల్ మీడియాలో పాకిస్తాన్ కు అనుకూల పోస్ట్ చేసినందుకు ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో శనివారం చోటుచేసుకుంది. 23 ఏళ్ల నిందితుడు తన వాట్సాప్ స్టేటస్‌లో పాకిస్తాన్ కు అనుకూల పోస్ట్ చేశాడని, దీనిని తీవ్రంగా పరిగణించి ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోతో అన్వర్ జమీల్ అనే మరో వ్యక్తిని శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు. విచారణ సమయంలో జమీల్ ఆ వీడియో పాతదని. ఒక స్నేహితుడు సరదాగా నినాదం చేయమని కోరితే అలా చేశానని పేర్కొన్నాడు. ఆ వీడియోలో కశ్మీర్‌లోని పుల్వామా, పహల్గామ్లలో జరిగిన సంఘటనల వెనుక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారంటూ నిందితుడు చెప్పుకొచ్చాడు.
బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే లేదా దేశ వ్యతిరేక కంటెంట్ వ్యాప్తిని కఠినంగా పర్యవేక్షిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దేశ వ్యతిరేక కంటెంట్‌ను పంచుకోకుండా ఉండాలని, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి కేసుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని, ఏ దోషిని కూడా వదిలిపెట్టబోమని పోలీసు యంత్రాంగం స్పష్టంగా పేర్కొంది. దేశ ఐక్యత, సమగ్రతకు ఎటువంటి ముప్పు కలగకుండా సోషల్ మీడియాలో పర్యవేక్షణను మరింత కఠినతరం చేస్తున్నామన్నారు.
Also read
- రైల్లో సీటు కోసం లొల్లి.. కట్ చేస్తే జేబులోంచి తుపాకీ తీసి ప్రయాణికులను బెదిరించిన రిటైర్డ్ పోలీస్ ఉద్యోగి!
- Conch for Vastu: ఇంట్లో శంఖం ఉంటే ఎన్ని శుభఫలితాలో.. ఆ కష్టాలన్నీ దూరం
- భార్యను అతికిరాతంగా చంపిన భర్త.. అడ్డొచ్చిన అత్తను కూడా..
- ముగ్గురు దుర్మరణం
మద్యం మత్తు.. అతివేగం - చిన్న వయసులో ఏ కష్టం వచ్చిందో..





