June 29, 2024
SGSTV NEWS
CrimeViral

ఈమె చావుని ముందే పసికట్టింది.. ముందురోజు షాకింగ్ పోస్ట్!

సోషల్ మీడియా పుణ్యమా అని రీల్స్, టిక్ టాక్ వీడియోలతో ఎంతోమంది రాత్రికి రాత్రే సెలబ్రెటీలుగా మారిపోతున్నారు. టిక్ టాక్ తో ఎంతో పాపులారి తెచ్చుకున్న వాళ్లు ఉన్నారు.

మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా ఉన్న వాళ్లు హఠాత్తుగా మన కళ్ల ముందు నుంచి దూరమైపోతుంటారు. సోషల్ మీడియా పుణ్యమా అని ఇటీవల కొంతమంది రీల్స్, టిక్ టాక్, యూట్యూబ్ వీడియోలతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు.కొన్ని వీడియోలకు లక్షల్లో లైక్స్ రావడంతో రాత్రికి రాత్రే సెలబ్రెటీలుగా మారుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టిక్ టాక్ తో ఎంతోమంది సెలబ్రెటీలుగా మారిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో తన టిక్ టాక్ వీడియోలతో ఎంతో మందిని అలరించింది.. కానీ అంతలోనే విషాదం జరిగిపోయింది. ఇంతకీ ఆ టిక్ టాక్ సెలబ్రెటీ ఎవరు.. ఏం జరిగింది అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..


టిక్ టాక్ తో తక్కువ కాలంలో ఎక్కువ పాపులారిటీ సంపాదించిన భారతీ ప్రవాసురాలు.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫుజైరాలోని 19వ అంతస్తులోని తన అపార్ట్ మెంట్ నుంచి పడి కన్నుమూసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకం రేపింది. మృతురాలి పేరు షనీఫా బాబు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని బుజైరా నివాసి. ఆమె తల్లిదండ్రులది కేరళా. కొంతకాలం క్రితం యూఏఈ కి వలస వెళ్లారు. షనిఫా టిక్‌టాక్ సెలబ్రిటీ. ఆమెకు పెళ్లై ఇద్దరు కూతుళ్లు. షనిఫా భర్త సనూజ్ బాబు ఫుజైరాలోని రియలెస్టేట్ వ్యాపారి. ఆమె చనిపోయిన సమయంలో  పిల్లలు, భర్త అక్కడే ఉన్నట్లు తెలుస్తుంది. నిన్నగాక మొన్న ఆమె తల్లి తన కూతురి వద్దకు దుబాయ్ నుంచి  వెళ్లింది.

షనిఫాకు సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. టిక్ టాక్ లో ఆమెకు 90,000 మందికి పైగా ఫాలోయింగ్ ఉందంటే అర్థం చేసుకోవచ్చు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఫన్నీ వీడియోలు చేస్తూ అందరినీ నవ్విస్తూ ఉండేది. అందుకే ఆమెకు తక్కువ సమయంలో టిక్ టాక్ లో విపపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆమె చివరి పోస్ట్ గురువారం నాడు పోస్ట్ చేసింది.. అందులో ‘ నాతో ప్రేమలో పడకండి.. నేను మీ హృదయాన్ని విచ్చిన్నం చేస్తాను’ అని తెలిపింది. ఇదిలా ఉంటే.. బుజేరా పోలీసులు కేసు నమోదు చేసి హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.  సోషల్ మీడియాలో ఫనిఫా చివరి  వీడియో చూసిన నెటిజన్లు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఆమె చావును ముందుగానే పసికట్టిందా అని చర్చించుకుంటున్నారు

Also read

Related posts

Share via