SGSTV NEWS
CrimeTechnology

Six Years Boy Incident:అర్ధరాత్రి
దారుణం.. ఆరేళ్ల బాలుడి గొంతుకోసి



మహబూబాబాద్ జిల్లా నారాయణపురం గ్రామంలో దారుణం జరిగింది. 1వ తరగతి చదువుతున్న 6 ఏళ్ల మనీష్ అనే బాలుడిపై గొంతు కోసి హత్యా యత్నం చేశారు. తల్లిదండ్రుల పక్కనే నిద్రిస్తుండగా.. రాత్రి 3 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి కత్తితో గొంతు పై దాడి చేశారు. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. నొప్పితో బాధ పడుతున్న బాలుడిన అతని నాయినమ్మ చూసి తల్లిదండ్రులు ఇద్దరిని నిద్రలేపింది.

రక్తపు మడుగులో ఉన్న బాలుడు హాస్పిటల్ కు తరలింపు

రక్తపు మడుగులో పడి ఉన్న బాలుడిని చూసి వెంటనే హాస్పిటల్ కు తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు పోలీసులు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. క్షుద్ర పూజల కోసం ఇలా చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అసలు వివరాల్లోకి వెళితే.. ఇంట్లోకి తెలియని వ్యక్తులు చొరబడి నిద్రిస్తున్న బాలుడి పై కత్తి తో దాడి చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చేందిన మందుల ఉపేందర్ శిరీష దంపతుల కుమారుడు మందుల మనీష కుమార్ (7) ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి కత్తితో బాలుడు పై దాడి చేశారు.

ప్రస్తుతం నిలకడగా ఉన్న బాలుడు ఆరోగ్యం

కత్తితో దాడి చేయడంతో బాలుడుకి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం అర్ధరాత్రి 3 గంటలకు సమయంలో ఈ దాడి జరిగింది. బాలుడికి స్థానిక వైద్యుడి వద్ద చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి ఘటన తెలిసి గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు. తల్లి తండ్రులు బాలుడు ఘడా నిద్రలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

క్షుద్ర పూజల కోసం ఇలా చేసి ఉంటారని అనుమానాలు

బాలుడు చిన్నగా నొప్పుల బాధతో ఏడుస్తుండగా బాలుడి నాయనమ్మ గుర్తించి తల్లి తండ్రులను నిద్ర నుండి లేపి స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ దంపతుల చిన్న కుమారుడు గతంలో నీటి కుంటలో పడి మృతి చెందాడు. ఇప్పుడు పెద్ద కుమారుడిపై దాడి జరగడంతో పలు అనుమానాలు రేకిత్తిస్తున్నాయి.ఆగంతకులు కారులో బొడ్రాయి వరకు వచ్చి స్థానికులను చూసి పరార్ అయినట్టు విశ్వసనీయ సమాచారం. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు.

Also read

Related posts

Share this