Andhra Pradesh: ఏపీలో నిరుద్యోగ సెగ ఒక
నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఉన్నత చదువులు చదివినా ఆశించిన స్థాయిలో ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపానికి గురైన ఒక యువతి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని తనువు చాలించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపింది.
వైఎస్సార్ జిల్లా మైలవరం మండలం దొమ్మర నంద్యాలకు చెందని చిన్యం లావణ్య (28) బీటెక్ పూర్తి చేసింది. ఎలాగైనా మంచి ఉద్యోగం సాధించి కుటుంబానికి ఆసరాగా నిలవాలని ఆమె ఎంతో కష్టపడింది. గత కొన్నేళ్లుగా రైల్వేతో పాటు వివిధ ప్రభుత్వ, ప్రేవేటు ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకుంటూనే ఉంది. కానీ, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కకపోవడం, వయసు పైబడుతుండటంతో ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే నిన్న మధ్యాహ్నం ఊరి బయట రోడ్డు పక్కన పెట్రోల్ పోసుకుని నిప్పంటంచుకుంది.
మంటల్లో చిక్కుకుని ఆ యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగం రాక, భవిష్యత్తుపై భయంతో ఆమె తీసుకున్న ఈ కఠిన నిర్ణయం ఆ గ్రామంలో విషాద ఛాయలు నింపింది. కన్న బిడ్డ ప్రయోజకురాలు అవుతుందని ఆశించిన ఆ తల్లిదండ్రులు, లావణ్య మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు అక్కడున్న వారిని కలచివేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- అంబటి నీకు చేత అయితే హుందాగా రాజకీయాలు చేయడం నేర్చుకో, ఎఐ తో కాదు…
- పరారీలో వైసీపీ నేత చింతాడ రవికుమార్
- August 2026 Horoscope: ఆగస్టు మాసంలో వీరి జాతకం మారబోతోంది..! అదృష్ట రాశులివే..
- Viral Video: దొంగ ఎలుక.. రాత్రికి వచ్చి గోల్డ్ షాపులో ఎలా చోరీలు చేస్తుందో చూడండి!
- ఏడాదిగా వెంటాడుతున్నాడు





