చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై విజయవాడ కొత్తపేట పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ లంబాడీపేట ప్రాంతానికి చెందిన బాలిక తండ్రి కొంతకాలం క్రితం మృతి చెందాడు. తల్లి ఓ హోటల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. స్థానికంగా కారు నడుపుతూ జీవనం సాగించే హేమంత్ నాగసాయి (23) ఆ బాలికకు పరిచయమై ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పి ఆమెను లొంగదీసుకున్నాడు. బాలిక తల్లి ఇంట్లోలేని సమయంలో బాలికపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. కొద్దిరోజులుగా బాలికకు ఒంట్లో బాగోకపోవడంతో తల్లి ప్రశ్నించగా.. బాలిక జరిగిన విషయం చెప్పింది. అనంతరం బాలిక కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. హేమంత్ నాగసాయిపై పోక్సో కేసు నమోదు చేశారు.
Also read
- Mantralayam మానవత్వన్ని చాటిన కానిస్టేబుల్.. మహిళ మృతదేహాన్ని కిలోమీటర్ మోసుకెళ్లి…(video)
- 30వ ప్లోర్ నుంచి పార్క్ చేసిన కారుపై పడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి.. షిఫ్టైన రెండ్రోజులకే
- Telangana: కూతురిపై లైంగిక వేధింపులు.. భర్తను చెట్టుకు కట్టేసి మరీ కొట్టి చంపిన భార్య!
- మామ హత్య కోసం రూ.5 లక్షల సుపారి… పచ్చని సంసారంలో చెడు వ్యసనాల చిచ్చు..
- హైదరాబాద్లో దారుణం.. చిన్న గొడవతో భార్యను కడతేర్చిన భర్త! చిన్నారుల ముందే ప్రాణం తీసిన రాక్షసుడు..





