విశ్రాంత ఉపాధ్యాయుడు మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై ఇనకుదురుపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
మచిలీపట్నం : విశ్రాంత ఉపాధ్యాయుడు
మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై ఇనకుదురు పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిరు వ్యాపారం చేసుకొనే ఓ వ్యక్తి తన వ్యాపార అవసరాల కోసం బుట్టాయిపేటకు చెందిన విశ్రాంత ఉద్యోగి నట దేవేంద్రరావు వద్ద వడ్డీకి నగదు తీసుకుంటుంటాడు. వడ్డీ వసూళ్ల పేరుతో దేవేంద్రరావు అతని ఇంటికి వచ్చి పోతుండేవాడు. ఈ నెల 17న నగదు తీసుకున్న వ్యక్తి ఇంటికి వెళ్లిన దేవేంద్రరావు ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పదో తరగతి పాసైన అతని కుమార్తెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. లైంగికంగా వేధించి విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా మౌనంగా ఉంటూ బాలిక ఆత్మహత్యకు ప్రయత్నించింది. నిలదీయడంతో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- తుని ఘటన: టీడీపీ నేత నారాయణరావు మృతదేహం లభ్యం
- Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..
- పెళ్లి కోసం వచ్చిన వ్యక్తికి ఫుల్గా తాగించిన మైనర్లు.. తర్వాత ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే
- Andhra: కడుపునొప్పితో మైనర్ బాలిక ఆస్పత్రికి.. ఆ కాసేపటికే..
- విజయవాడలోని ఈ ప్రాంతంలో భయం..భయం.. ఎందుకో తెలిస్తే అవాక్కే..