హైదరాబాద్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. అపార్టుమెంట్‌లో కారు పార్కింగ్ విషయమై జరిగిన ఘర్షణలో ఖమ్మం జిల్లా వాసి నాగిరెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన చైతన్యపురిలోని కొత్తపేట వైష్ణవి రుతిక అపార్టుమెంట్‌లో జరిగింది.
చిన్న చిన్న గొడవలు.. పెద్ద పెద్ద ఘోరాలకు దారి తీస్తుంది. క్షణకావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. పార్కింగ్ విషయమై జరిగిన గొడవలో ఒకరి నిండు ప్రాణం పోయింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని వైష్ణవి రుతిక అపార్టుమెంట్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే
పార్కింగ్ గొడవ ప్రాణాలు తీసింది
ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన 48 ఏళ్ల గండ్ర నాగిరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అతడు దాదాపు 13 ఏళ్లుగా చైతన్యపురిలోని కొత్త పేట వైష్ణవి రుతిక అనే అపార్టుమెంటులో నివాసముంటున్నాడు. అయితే అదే అపార్టుమెంట్‌లో సూరి కామాక్షి అనే మహిళ అద్దెకు ఉంటుంది. ఓ రోజు రాజమండ్రికి చెందిన ఆమె అల్లుడు కృష్ణ జివ్వాజి కామాక్షి ఇంటికి వచ్చాడు.
అతడు తన కారును అపార్టు పక్కన పార్క్ చేసి కామాక్షి ఇంటికి వెళ్లాడు. అదే సమయంలో నాగిరెడ్డి బయటనుంచి వచ్చి తన కారును కృష్ణ కారు వెనక పార్క్ చేశాడు. అనంతరం కృష్ణ తన అత్త ఇంటి నుంచి వెళ్లిపోయేందుకు కిందికి వచ్చాడు. అప్పుడే తన కారుపై గీతలు ఉన్నట్లు గమనించాడు. దీనికి తన కారు వెనుక పార్క్ చేసిన నాగిరెడ్డి కారణమని.. వాచ్‌మెన్‌తో అతడ్ని కిందికి రప్పించాడు
అనంతరం నాగిరెడ్డితో కృష్ణ గొడవ పడ్డాడు. అది కాస్త ఉదృతంగా మారడంతో నాగిరెడ్డిపై దాడి చేశాడు. దీంతో అతడి నోటి నుంచి నురగ, చెవిలోంచి రక్తం వచ్చి కింద పడిపోయాడు. అయితే అప్పటికే అతడిని హాస్పిటల్‌కు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. నాగిరెడ్డి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇక ఈ గొడవలో నాగిరెడ్డి కింద పడిపోగానే కృష్ణ పరారయ్యాడు. అతడి అత్త కామాక్షి తన ఇంటికి తాళం చేసి పారిపోయింది. ఈ ఘటనపై మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం డెడ్ బాడీని పోర్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు తమ స్వగ్రామానికి తీసుకెళ్లారు.
Also read
- Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సైబర్ దాడి కోణం..? ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాక్ చేసి..
- బ్లాక్ బాక్స్ ఏ రంగులో ఉంటుంది..? విమానంలో ఏ భాగంలో ఉంటుంది..? ఇది గ్రూప్1 ప్రిలిమ్స్ ప్రశ్న
- తొలిసారి భారత్‌లో మొదలైన బ్లాక్‌బాక్స్ డీకోడింగ్ ప్రక్రియ.. ఏ ఒక్క క్లూని వదలని దర్యాప్తు సంస్థలు!
- విమాన శిథిలాల్లో దొరికిన కీలక క్లూ.. DVRను విశ్లేషించనున్న FSL బృందం
- ఎయిరిండియా విమానం కూలిపోవడానికి కారణాలివేనా.? షాకింగ్ విషయాలు చెప్పిన అమెరికా నిపుణులు