మైలవరం: మైలవరం మండలం వేపరాల గ్రామం సమీపంలోని పెన్నా నదిలో స్నానానికి వెళ్లిన అత్త, అల్లుడు నీటిలో మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం… తొర్రివేముల గ్రామానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు సరదాగా స్నానం చేయడం కోసం పెన్నా నదికి వెళ్లారు. అయితే, నీటి లోతును గమనించకపోవడంతో ప్రమాదవశాత్తు కళ్యాణ్ కుమార్ (25), అతని అత్త వరుస అయిన వెంగమ్మ (45) నీటిలో మునిగిపోయారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానికులు, అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపులో భాగంగా మొదట కళ్యాణ్ కుమార్ మృతదేహాన్ని వెలికితీశారు. వెంగమ్మ మృతదేహం కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఊహించని ప్రమాదంతో తొర్రివేముల గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also read
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..
- ఇన్‌స్టాలో పరిచమయ్యాడు.. తర్వాత ఇంటి నుంచి తీసుకెళ్లాడు.. కట్‌చేస్తే.. 3 నెలల తర్వాత..





