SGSTV NEWS
Andhra PradeshCrimeTelangana

Rama Rajyam Veera Raghava Reddy : నేనే శివుడిని..రామరాజ్యం వీర రాఘవరెడ్డి రిమాండ్ రిపోర్టులోసంచలన అంశాలు


అర్చకులు రంగరాజన్ పై దాడి చేసిన రామరాజ్యం వీర రాఘవరెడ్డి కేసులో సంచలన అంశాలు వెలుగు చూశాయి. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ఉన్నట్లు తేలింది. తనకు తాను శివుడి అవతారం అని క్రియేట్ చేసుకున్నాడు వీర రాఘవరెడ్డి. రామరాజ్యంలో రిక్రూట్ మెంట్ కూడా ప్రారంభించాడు

Rama Rajyam Veera Raghava Reddy :రామరాజ్యం వీర రాఘవరెడ్డి కేసులో సంచలన అంశాలు వెలుగు చూశాయి. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ఉన్నట్లు తేలింది. తనకు తాను శివుడి అవతారం అని క్రియేట్ చేసుకున్నాడు వీర రాఘవరెడ్డి. తనది శివుడి అవతారం అంటూ రామరాజ్యంలో రిక్రూట్ మెంట్ కూడా ప్రారంభించాడు. ఏపీకి చెందిన వీర రాఘవరెడ్డి ఇటీవల చిలుకూరు ఆలయ అర్చకులు రంగరాజన్ పై దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే వీర రాఘవరెడ్డిని, మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరంతా రిమాండ్ లో ఉన్నారు.

వీరరాఘవరెడ్డి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ రామా రాజ్యంతోనే సాధ్యం అని వీడియోలు చేశాడు. రామరాజ్యం పేరుతో అక్రమ వసూళ్లు,  పూజారులపై భౌతిక దాడులు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. వీర రాఘవరెడ్డికి గతంలోనూ నేర చరిత్ర ఉందని అన్నారు. వీర రాఘవరెడ్డిపై 2015, 2016లోనే కేసులు ఉన్నాయని వెల్లడించారు. చిలుకూరు రంగరాజన్‌కు ఉగాది వరకు సమయం ఇస్తున్నామని వీర రాఘవరెడ్డి బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా గుర్తించిన కొవ్వూరి వీర రాఘవ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన వీర రాఘవ రెడ్డి, రామరాజ్యం అనే ప్రైవేట్ సైన్యాన్ని నడిపిస్తున్నాడు. దేశవ్యాప్తంగా రామరాజ్యం స్థాపన కావాలని ప్రచారం చేస్తున్న అతడు.. పదో తరగతి పాసైన లేదా ఫెయిల్ అయిన యువకులను తన సైన్యంలో రిక్రూట్ చేస్తూ వచ్చాడు. వీర రాఘవ రెడ్డి తన రామరాజ్యం సైన్యంలో చేరాలని అర్చకుడు రంగరాజన్‌పై ఒత్తిడి చేశాడు. రంగరాజన్ దానికి నిరాకరించడంతో అతనిపై తీవ్రంగా దాడి చేశాడు.

శివుడి అవతారంలో రామరాజ్యం స్థాపనకు కృషి చేయాలన్న ఆలోచనతో తనకంటూ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొనేందుకు ప్రత్యేక నియామకాలు నిర్వహించారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ రామ రాజ్యం తోనే సాధ్యమని సోషల్ మీడియా వేదికగా వీడియోలను పోస్ట్ చేస్తూ ప్రచారం సాగించారు. ఇది ఇలా ఉంటే వీర రాఘవరెడ్డికి చెందిన పలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక జిల్లా కలెక్టర్ ను అరెస్ట్ చేసినట్లు సీఐ తో ఫోన్ లో మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. చట్టాన్ని మీరెలా చేతిలోకి తీసుకుంటారని సీఐ ప్రశ్నించగా, చట్టం తనకు అన్ని హక్కులు ఇచ్చినట్లు ఆ ఆడియోలో ఉంది. మరి ఆ ఆడియోలో ఉన్నది వీర రాఘవరెడ్డి  వాయిస్ ఔనా కాదా అన్నది తేలాల్సి ఉంది. అలాగే ఒక వ్యక్తి చేత రామరాజ్యం రాజు అనే తరహాలో ప్రమాణం చేయించిన వీడియోలు కూడా వైరల్ గా మారాయి.

Also read



Related posts

Share this