మాజీ సీఎం జగన్ గుంటూరు పర్యటనలో అపశృతి నెలకొంది. ర్యాలీలో జగన్ కాన్వాయ్‌లోని ఒక కారు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందడం కలకలం రేపింది. గుంటూరు జిల్లా లాల్పురం హైవేపై ఈ దుర్ఘటన జరిగింది.
మాజీ సీఎం జగన్ గుంటూరు పర్యటనలో అపశృతి నెలకొంది. ర్యాలీలో జగన్ కాన్వాయ్‌లోని ఒక కారు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందడం కలకలం రేపింది. గుంటూరు జిల్లా లాల్పురం హైవేపై ఈ దుర్ఘటన జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. జగన్ బుధవారం పల్నాడు జిల్లా పర్యటను వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు.
అయితే జగన్ కాన్వాయ్ వెంట ఉన్న ఒక కారు లాల్పురం హైవే దగ్గర ఓ వృద్ధుడిని ఢీకొంది. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. కానీ వైసీపీ కార్యకర్తలు మాత్రం వృద్ధుడిని రోడ్డు పక్కనే వదిలేసి వెళ్లిపోయారు. చివరికి స్థానికులు స్పందించి ఆ వృద్ధుడిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆ వృద్ధుడు మృతి చెందాడు. దీంతో వైసీపీ కార్యకర్తలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also read
- గ్లిజరిన్ వేసుకుని ఏడ్చినట్లు నమ్మించిందా?.. తేజేశ్వర్ హత్య కేసులో కొత్త అంశం
- Tadipatri: వేట కొడవలితో దాడి.. చికిత్స పొందుతూ యువకుడి మృతి
- Palnadu: పల్నాడు జిల్లాలో దారుణం.. కుమారుడిని చంపి కాలువలో పూడ్చేసిన తండ్రి
- Crime News: ప్రియుడితో కలిసి భర్తను చంపించి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
- నేటి జాతకములు..16 జూలై, 2025