సంగారెడ్డి జిల్లా.. కలికాలంలో మానవత్వం ముసుగులో మృగాలు తిరుగుతున్నాయి…ఆపదలో ఉన్నామని లిఫ్ట్ అడిగితేనే ఇవ్వని రోజుల్లో…తానే లిఫ్ట్ ఇస్తానని నమ్మించి వృద్ధ దంపతుల్ని నిలువు దోపిడీ చేసాడు ఓ దుర్మార్గుడు…ఈ ఘటన సంగారెడ్డి జిల్లా చిట్కుల్ సమీపంలో చోటు చేసుకుంది..వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన గాజం హిమగిరి,సుధాకర్ దంపతులు హైదరాబాద్లో ఉంటున్న తమ కుమార్తెను కలిసి, తిరుగు ప్రయాణంలో ఏడుపాయల దుర్గమ్మ దర్శనానికి వెళ్లారు…శనివారం ఉదయం 11 గంటల సమయంలో దర్శనం ముగించుకుని వస్తుండగా,తెల్ల రంగు కారులో వచ్చిన ఒక గుర్తు తెలియని వ్యక్తి వారిని పలకరించాడు..తానే స్వయంగా గమ్యస్థానానికి చేరుస్తానని నమ్మబలికి కారు ఎక్కించు కున్నాడు..మార్గమధ్యలో చిట్కుల్ శివారులోని ప్రసిద్ధ చాముండేశ్వరి ఆలయం ఉందని,అక్కడ కూడా దర్శనం చేసుకుందామని వారిని తీసుకెళ్లాడు. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో మంజీరా నది సమీపంలోని ఎనగండ్ల రోడ్డు వద్ద ఫంక్షన్ హాల్ దగ్గర కారు ఆపాడు. బాధితురాలు హిమగిరి మంజీరా నది వద్ద నీటి కోసం వెళ్లగా..అదే అదనుగా భావించిన నిందితుడు ఆమె మెడలోని బంగారు గొలుసును తెంచుకుని కారులో మెరుపు వేగంతో పరారయ్యాడు. కోలుకున్న బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిట్కుల్ ఎస్సై నర్సింహులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆ తెల్ల రంగు కారు ఆచూకీ కోసం గాలిస్తున్నారు..గుర్తు తెలియని వ్యక్తులు లిఫ్ట్ ఇస్తామంటే నమ్మవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.
Also read
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!
- వరాహ జయంతి సెప్టెంబర్ 13నా.. 14నా? తేదీ, శుభ సమయం, పూజా విధానం ఇదే!
- దేవుడా.. ఇలాంటి కూతురు ఎవ్వరికీ పుట్టొద్దు.. ప్రియుడి కోసం కన్నతల్లినే దారుణంగా..





