July 3, 2024
SGSTV NEWS
Andhra PradeshPolitical

రాజమండ్రి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక నగరిగా పేరొందిన రాజమండ్రి.. ఘన చరిత్రకు ఆనవాలు. సాంస్కృతికంగానూ , రాజకీయంగానూ రాజమండ్రికి ఎంతో విశిష్ట చరిత్ర వుంది. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన దిగ్గజాలను ఈ నగరం అందించింది. ఓటర్ల తీర్పు ప్రతీసారి విలక్షణం కనిపిస్తుంటుంది ఇక్కడ. 1952 నుంచి ఈ నియోజకవర్గానికి 18 సార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 10 సార్లు, టీడీపీ 3 సార్లు, బీజేపీ రెండు సార్లు, వైసీపీ, సీపీఐ, సోషలిస్ట్ పార్టీలు ఒకసారి గెలిచాయి. రాజమండ్రి నుంచి ఎక్కువగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే ఎంపీలుగా విజయం సాధించారు.



రాజమండ్రి.. ఈ ఊరు పేరు చెప్పగానే గల గల పారే గోదావరి, దానిపై కట్టిన రోడ్డు కం రైలు బ్రిడ్జ్, కాటన్ చేతుల్లో పురుడు పోసుకున్న ధవళేశ్వరం బ్యారేజ్ మదిలో మెదులుతాయి. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక నగరిగా పేరొందిన రాజమండ్రి.. ఘన చరిత్రకు ఆనవాలు. రాజరాజ నరేంద్రుడు పాలించిన ఈ నగరంలోనే కవిత్రయంలో ఒకరైన నన్నయ్య మహాభారతం రచించారు. సామాజిక దురాచారాలపై పోరాడిన సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు , ఎందరో కవులు , కళాకారులకు పుట్టినిల్లు ఈ నగరం.

సాంస్కృతికంగానూ , రాజకీయంగానూ రాజమండ్రికి ఎంతో విశిష్ట చరిత్ర వుంది. ఇక ఇక్కడి సెంట్రల్ జైలు దేశవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకుంది. తెలుగునాట ప్రతి ఒక్కరికి రాజమండ్రి కేంద్ర కారాగారం పేరు తెలుసు. బ్రిటీష్ వారి హయాంలో రాజమండ్రిలో మాత్రమే ఉరిశిక్షలను అమలు చేసేవారు. ఇది 1974 వరకు కొనసాగింది. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఉరిశిక్షలను అమలు చేసే అధికారిక జైలు ఇదే కావడం గమనార్హం.

రాజమండ్రి ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. కమ్మవారిదే డామినేషన్ :

రాజకీయంగానూ రాజమండ్రికి ఘన చరిత్ర వుంది. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన దిగ్గజాలను ఈ నగరం అందించింది. ఓటర్ల తీర్పు ప్రతీసారి విలక్షణం కనిపిస్తుంటుంది ఇక్కడ. 1952 నుంచి ఈ నియోజకవర్గానికి 18 సార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 10 సార్లు, టీడీపీ 3 సార్లు, బీజేపీ రెండు సార్లు, వైసీపీ, సీపీఐ, సోషలిస్ట్ పార్టీలు ఒకసారి గెలిచాయి. రాజమండ్రి నుంచి ఎక్కువగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే ఎంపీలుగా విజయం సాధించారు. ఆ తర్వాత బ్రాహ్మాణ సామాజిక వర్గానికి చెందినవారు ఇద్దరు, కాపులు రెండుసార్లు, క్షత్రియ, ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన ఒక్కొక్కసారి విజయం సాధించారు. సినీనటులు జమున, మురళీమోహన్‌లు ఇక్కడి నుంచి ఎంపీలుగా గెలిచారు.

రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం అసెంబ్లీ సెగ్మెంట్లు వున్నాయి. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 15,34,256 మంది. వీరిలో పురుషులు 7,80,124 మంది.. మహిళలు 7,54,010 మంది. త2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఏడు స్థానాల్లో ఐదింటిని వైసీపీ గెలుచుకుంది. వైసీపీ అభ్యర్ధి మార్గానికి భరత్‌కు 5,82,024 ఓట్లు .. టీడీపీ అభ్యర్ధి మాగంటి రూపకు 4,60,390 ఓట్లు.. జనసేన అభ్యర్ధి ఆకుల సత్యనారాయణకు 1,55,807 ఓట్లు పోలయ్యాయి. దీంతో వైసీపీ 1,21,634 ఓట్ల తేడాతో రాజమండ్రిని దక్కించుకుంది.

రాజమండ్రి (పార్లమెంట్) ఎన్నికల ఫలితాలు 2024 .. బరిలో వుండేదెవరు :

రాజమండ్రి లోక్‌సభ స్థానంలో వైసీపీ తరపున గూడూరి శ్రీనివాస్‌ బరిలో నిలవనున్నారు. చివరి నిమిషంలో మార్పులు చేయాల్సి  వస్తే గన్నమనేని వెంకటేశ్వరరావు, అవంతీ సీ ఫుడ్స్ అధినేత అల్లూరి ఇంద్రకుమార్ చౌదరి పేర్లు పరిశీలనలో వున్నాయి. తెలుగుదేశం పార్టీ తరపున ఆదిరెడ్డి వాసు, బుచ్చయ్య చౌదరి పేర్లు వినిపిస్తున్నాయి. టీడీపీ , జనసేన, బీజేపీ పొత్తులో .. రాజమండ్రిని బీజేపీ కోరింది

Also read

Related posts

Share via