SGSTV NEWS online
CrimeTelangana

ప్రేమ వివాహం చేసుకుందామని వచ్చి.. పెళ్లి దుస్తుల్లోనే యువకుడి ఆత్మహత్య

కేపీహెచ్బీకాలనీ, : వారిద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అంతలోనే ఏమైందో ఏమో.. పెళ్లి దుస్తులు ధరించిన ఆ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ కేపీ హెచ్బీ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం… ఏపీలోని అనంతపురం జిల్లా పొట్లూరు మండలం చెర్లోపల్లికి చెందిన వనమల లోకేశ్(29), ఓ యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. హైదరాబాద్లోని గండిమైసమ్మ ప్రాంతంలో ఇద్దరూ ఒకే ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వివాహం చేసుకోవాలనుకున్నారు. ఇద్దరూ పెళ్లి దుస్తులు కూడా కొనుగోలు చేశారు. శుక్రవారం అడ్డగుట్టలో ఓ హోటల్ గదిని అద్దెకు తీసుకున్నారు. లోకేశ్ పెళ్లి దుస్తులు ధరించాడు. తాను పెళ్లి దుస్తుల్లో ఉన్నానని… భోజనం తీసుకురమ్మని యువతిని బయటకు పంపించాడు. భోజనం తీసుకుని యువతి గదికి వెళ్లి తలుపు కొట్టగా స్పందన లేదు. దీంతో యువతి స్నేహితులకు ఫోన్ చేయగా వారు వచ్చి హోటల్ యాజమాన్యం సాయంతో తలుపులు పగలగొట్టి చూడగా లోకేశ్ ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించాడు. వాస్తవానికి ఈ నెల 4న గుడి లేదా ఆర్య సమాజ్లో వివాహం చేసుకుందామని యువతికి చెప్పిన లోకేశ్.. ముందురోజే పెళ్లి దుస్తులు ధరించడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై లోకేశ్ బంధువులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.

Also read

Related posts