నిడదవోలు యర్నగూడెం రోడ్ లో ఐ.యఫ్.టి.యు అనుబంధ వెల్డింగ్ & ఐరన్ డిజైనింగ్ వర్కర్స్ యూనియన్ సమావేశం యూనియన్ ప్రెసిడెంట్ తీపర్తి వీర్రాజు అధ్యక్షతన నిర్వహించడమైనది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1 మార్చి 2026 నుండి అమలులోకి వచ్చిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు పొందడానికి కార్మికులు తాము గతంలో పొందిన లేబర్ కార్డు లను సక్రమంగా రెన్యువల్ చేసుకోవాలని లేని పక్షంలో పధకాలు పొందేందుకు అర్హత కోల్పోతారన్నారు.
ఇఫ్టూ అనుబంధ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు ఈమని గ్రీష్మ కుమార్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు సమగ్రంగా, పూర్తిగా అమలు చేయాలని, ప్రమాద మరణ పరిహారం, అంగవైకల్యం పరిహారం, వైద్య సహాయం, కార్మికుల పిల్లలకు స్కాలర్ షిప్ లు, తదితరాలు ప్రస్తావించకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ఎన్నికల్లో ఇచ్చిన హామీ అరకొరగా అమలు కు పూనుకుంటోందనీ తక్షణమే ఇతర రాష్ట్రాల లో అమలు చేస్తున్న విధంగా పరిహారాల ను పెంపుదల చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పై కార్యక్రమంలో యూనియన్ నాయకులు గాలి గని రాజు, అవిడి ప్రసాద్, ముళ్ళా వంశీ, మోర్త పోసి, గాలి అరుణ్, రేవు సూరిబాబు, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.
Also read
- రెండేళ్ల పసికందుపై.. కసాయి తండ్రి దారుణం
- ఆ ఊర్లో అర్ధరాత్రి ఇళ్లపై రాళ్ల వర్షం.. భయంతో వణికిపోతున్న జనాలు! అంతుచిక్కని మిస్టరీ..
- బీచ్లో కొట్లాట.. కట్ చేస్తే.. బయటపడ్డ ఎప్పుడో జరిగిన హత్య కేసు మిస్టరీ..!
- ఒంటరి మహిళలే టార్గెట్! వృద్ధురాలి మెడలోంచి 5 తులాల బంగారం చోరీ.. సీసీ కెమెరాలో దృశ్యాలు
- బ్యాంక్ అధికారులమంటూ బురిడీ.. క్రెడిట్ కార్డు యాక్టివేషన్ పేరుతో నిండా ముంచేశారు!





