*ఉయ్యూరు*
*ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు – తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్.*
*ఉయ్యూరులో జిల్లా పార్టీ అధ్యక్షులు కొనకల్ల నారాయణరావు గారు, మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాల సౌరి గారు,పెనమలూరు నియోజకవర్గం అభ్యర్థి బోడె ప్రసాద్ గార్లతో కలిసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేసిన వై.వి.బి. రాజేంద్రప్రసాద్ గారు.*
*పెనమలూరు నియోజకవర్గం, ఉయ్యూరు టౌన్ లో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి ఎన్డీఏ కూటమి అభ్యర్థులైన మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి గారికి గాజు గ్లాస్ గుర్తుపై,నియోజకవర్గ అభ్యర్థి బోడే ప్రసాద్ గారికి సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్రను వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరిన రాజేంద్రప్రసాద్ గారు.*
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ…
ఈ జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనకు విసిగి ఉన్న ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ జగన్ ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దె దింపుదామా ఎదురుచూస్తున్నారని, ఈరోజు ఉయ్యూరులో ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ప్రజలు బయటకు వచ్చి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థమవుతుందని, ఎన్డీఏ కూటమి ప్రభంజనం ఆపడం ఎవరివల్లా కాదని రాజేంద్రప్రసాద్ అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం,జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Also read
- Garuda Purana: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? గరుడ పురాణం ప్రకారం స్వర్గం, నరకం, వైకుంఠం రహస్యాలు
- సూర్యాస్తమయం తర్వాత ఈ 6 వస్తువులు కొనొద్దు.. లక్ష్మీదేవి అనుగ్రహానికి దూరమవుతారా? వాస్తు ఏం చెబుతోంది?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ.. కట్ చేస్తే..
- అర్థరాత్రి ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్ధాలు.. అనుమానం వచ్చి ఉదయం వెళ్లి చూడగా.. వామ్మో





