గుంటూరు: ఓ కేసులో పోలీసులు స్టేషన్కు పిలిపించి వేధిస్తున్నారంటూ మహిళ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. తిరుపతమ్మ అనే మహిళ భర్తతో కలిసి తెనాలి కొత్తపేటలోని ఓ అపార్ట్మెంట్లో పనిచేస్తోంది. అపార్ట్మెంట్లోని ఓ మహిళ.. బంగారం అడిగి తీసుకొని తిరుపతమ్మ తిరిగి ఇవ్వలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో తిరుపతమ్మను పోలీసులు విచారణకు పిలిచారు. అపార్ట్మెంట్లోని మహిళ తనకు బంగారం ఇచ్చానని తప్పుడు ఫిర్యాదు చేసిందని, స్టేషన్కు పిలిపించి పోలీసుల వేధిస్తున్నారంటూ శనివారం సెల్ఫీ వీడియో తీసుకొని పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందింది.
Also read
- ఆమె వల్ల పరువు పోతోంది.. చంపేయ్.. కుమార్తెను ప్రియుడితో చంపించిన తండ్రి
- కేపీహెచ్బీలో విషాదం.. ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య
- మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
- ఫోక్సో కేసులో యువకుడి అరెస్ట్.. ఆరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా పోలీసులకే ట్విస్ట్ ఇచ్చిన నిందితుడు!
- ఓరి నాయనో..వీళ్లేం విద్యార్థులు బాబోయ్…నర్సింగ్ హాస్టల్లో అమ్మాయిల విధ్వంసం భయానకం..!





