బెంగళూరులో “నగ్నపూజ” పేరుతో ఓ యువతిని మోసం చేయడానికి ప్రయత్నించిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. Bengaluru దక్షిణ జిల్లాలోని రామనగర తాలూకాలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కారు డ్రైవర్గా పనిచేస్తున్న కిరణ్ అనే వ్యక్తిని పోలీసులు నిందితుడిగా గుర్తించి కేసు నమోదు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడు కిరణ్ ఒక యువతికి ఫోన్ చేసి “ప్రత్యేక నగ్నపూజ”లో పాల్గొంటే రూ.30 లక్షలు ఇస్తానని ఆశ చూపించాడు. ఒక్క రాత్రిలోనే పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని, ఇది చాలా రహస్యంగా జరిగే పూజ అని నమ్మబలికే ప్రయత్నం చేశాడు. డబ్బు ఆశతో యువతిని వలలో వేసుకోవాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అక్కడితో ఆగకుండా, వాట్సాప్ ద్వారా తనకు నగ్నచిత్రాలు పంపాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. శరీరంపై పుట్టుమచ్చలు ఉంటే పూజకు పనికిరాదని చెప్పి, వెంటనే ఫోటోలు పంపాలని కోరాడు.
యువతి స్పందించకపోవడంతో పలుమార్లు కాల్స్, మెసేజ్లు చేస్తూ వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని హెచ్చరించడం ద్వారా మరింత భయాందోళనకు గురిచేశాడు. ఈ వేధింపులను తట్టుకోలేకపోయిన బాధితురాలు తన తల్లితో కలిసి పోలీసులను ఆశ్రయించింది. యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిపై దర్యాప్తు ప్రారంభించారు. మొబైల్ కాల్ రికార్డులు, వాట్సాప్ చాట్ వివరాలను సేకరించి మరిన్ని ఆధారాలను పరిశీలిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇలాంటి ఘటనలు సైబర్ నేరాల కింద కూడా పరిగణించబడతాయి. మహిళలపై వేధింపులు, మోసం, అసభ్య ప్రవర్తన వంటి సెక్షన్ల కింద నిందితుడిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఇటీవలి కాలంలో సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ ద్వారా ఇలాంటి మోసాలు పెరుగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. “పూజలు, భారీ డబ్బు, లక్కీ ఆఫర్లు” అంటూ మోసగాళ్లు యువతను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు. తెలియని వ్యక్తుల మాటలకు నమ్మకం పెట్టుకోకూడదని, వ్యక్తిగత ఫోటోలు లేదా వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని సూచించారు
Also read
- అధిక మాసం రహస్యాలు.. జ్యేష్ఠ మాసంలో తప్పక చేయాల్సిన పూజలు, నియమాలు..
- ఏకదంత సంకష్టి చతుర్థి: మే 5నా లేదా 6నా? చంద్రోదయ సమయం, పూర్తి పూజా విధానం..
- ఒకరాత్రి నగ్నపూజకు రూ.30 లక్షలు
- ఐఫోన్.. ఆవేశం.. విషాదం
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





