హైదరాబాద్: ఐఫోన్ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో తీవ్ర మనస్థాపానికి గురైన భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కుద్భిగూడ ప్రాంతానికి చెందిన బక్కి ప్రియ (42)కు 20 ఏళ్ల క్రితం మల్లికార్జున్ ముస్తాపూర్ తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు.
కొత్తగా తీసుకొచ్చిన ఐ ఫోన్ను తన కజిన్కు భర్త ఇచ్చాడు. ఈ విషయంపై ఆదివారం ఉదయం భార్యాభర్తులు గొడవపడ్డారు. ఆవేశంలో ప్రియ ఇంట్లో ఉన్న చెదల మందు తాగింది. ఇది గమనించిన భర్త వెంటనే ఆమెను కాచిగూడలోని సీసీ ప్రాఫ్ ఆస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రియ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ రాజశేఖర్ తెలిపారు.
Also read
- Garuda Puran: భర్త భార్యను- భార్య భర్తను హింసిస్తే గరుడ పురాణం ప్రకారం శిక్షేంటో తెలుసా!
- Seven Spiritual Cities: జీవితకాలంలో ఈ ఏడు క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే.. స్వర్గలోకంలోకి ఎంట్రీ ఖాయమట
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- రైతులను ఏడిపించిన కాపర్ గ్యాంగ్.. పట్టుకుని వీధుల గుండా భలే మర్యాద చేసిన పోలీసులు!
- అర్ధరాత్రి వదిన లేదని తెలిసి ఇంట్లోకి చొరబడ్డ మరదలు! సీన్ కట్ చేస్తే.. ఊహించని షాక్





