మనం ఇంట్లో ఏదైనా పూజ, వ్రతం, హోమం వంటి పూజా కార్యక్రమాలు చేసినప్పుడు ప్రదక్షిణలు చేస్తుంటాం. అలాగే, ఆలయాలకు వెళ్లినప్పుడు దేవుడిని దర్శించుకునే ముందు ప్రదక్షిణలు చేస్తాం. అయితే, ఇలా ప్రదక్షిణ చేయడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి? గుడి చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేయాలి? తదితర విషయాలను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త కాకునూరి సూర్యనారాయణ మూర్తి ఇలా వివరిస్తున్నారు.
‘ప్రదక్షిణ’ అంటేనే ఏదో ఆశించి చేసేటటువంటి పని. ఒక అయస్కాంతం మీద చిన్న ఇనుప ముక్కను వృత్తాకారంలో కాసేపు అలా రుద్దితే, కొద్దిసేపటి తర్వాత ఆ ఇనుప ముక్కకు అయస్కాంత శక్తి వస్తుంది. ఇదే ప్రదక్షిణలకు కూడా వరిస్తుందంటున్నారు ఆధ్యాత్మికవేత్త సూర్యనారాయణ మూర్తి. దేవుడి విగ్రహం అడుగున ఉంచిన యంత్రానికీ దాంట్లో నిక్షిప్తమైన మంత్రాలకూ శక్తి ఉంటుందట. ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా ఆ శక్తి మనలోనూ ప్రవేశించి మానసిక, శారీరక ఆరోగ్యం సొంతమవుతుందంటున్నారు.
సూర్యుడి చుట్టూ భూమి ప్రదక్షిణ చేస్తోంది. భూమి తనకంటే పెద్ద శక్తి ఈ సూర్యుడు కనుక ప్రదక్షిణ చేస్తుంది. ఆకర్షణ ఎక్కడ శక్తి ఉంటుందో ఆ శక్తి చుట్టూ ఇతరులంతా కూడా ఆకర్షణతో వస్తారు కదా. అలాగే, భూమి చుట్టూ చంద్రుడు ప్రదక్షిణ చేస్తున్నాడు. ఇది కూడా ఆకర్షణే. ఆలయానికి వెళ్లిన మనం మనకంటే కూడా పెద్ద శక్తి ఆ దేవాలయంలో ఉన్నది అనేటటువంటి స్థిరమైన విశ్వాసంతో ఆ దైవం చుట్టూరా ప్రదక్షిణ చేస్తూ ఉంటామని చెబుతున్నారు ప్రవచనకర్త కాకునూరి సూర్యనారాయణ మూర్తి.
మనలోనే గొప్ప శక్తి ఉన్నది. మన మనసు దైవం. ఈ జ్ఞానం కలవారు చేసేటటువంటి ప్రదక్షిణను ఆత్మప్రదక్షిణగా చెబుతారు. ‘ప్రాగారభ్య దక్షిణేన వర్తనం’ తూర్పున నిల్చొని పడమర వైవుగా ఉండే ఆ దైవాన్ని తూర్పు ముఖంగా ఉన్నట్లుగా చూచి మనం మన ఎడమ చేతి వైపుగా నడక ప్రారంభిస్తాం. తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్యం ఇలా పూర్తి చేస్తాం. ఇలా తిరగడం ప్రదక్షిణ అనుకున్నప్పుడు కనీసంలో కనీసంగా సమస్త ఆలయాలకు 3 ప్రదక్షిణలు చేయాలని చెబుతున్నారు. సత్వ రజస్తమో గుణాలకు ఈ ప్రదక్షిణలు ప్రతీక. గత జన్మము, వర్తమాన జన్మము, భవిష్యత్ జన్మమునకు కూడా ఈ మూడు ప్రదక్షిణలు ప్రతీక అని చెబుతున్నారు.
నవగ్రహ మంటపానికి తొమ్మిది, రావిచెట్టు-వేప చెట్టు కలిపి ఉండగా ఆ చోట చేసేటట్లయితే 27 ప్రదక్షిణలు చేయాలి. జమ్మి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయాలి. ఇవన్నీ తర్వాత కాలంలో అనేకులు ఇలా పెంచుకుంటూ వెళ్తూ ఉండేటటువంటి నేపథ్యంలో సంతాన క్షేమం కోరేటటువంటివారు రాగి చెట్టు-వేప చెట్టు కలిపిన చోట ప్రదక్షిణ చేస్తారు. ఆ చెట్టు వల్ల లభించే గాలి వీరిలో సానుకూల దృక్పథాన్ని పెంచుతుంది. ఆశావహ దృక్పథాన్ని కూడా పెంపొందిస్తుంది. కనుక ప్రదక్షిణలు ఎప్పుడూ మంచివే అంటున్నారు ఆధ్యాత్మికవేత్త సూర్యనారాయణ మూర్తి.
ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ నియమాలు పాటించాలి!
👉 ప్రదక్షిణను భగవంతుడిని భక్తితో స్మరించుకుంటూ చేయాలని చెబుతున్నారు.
👉 ప్రదక్షిణ చేసే సమయంలో మౌనంగా ఉండాలి. నెమ్మదిగా నడవాలి. పరిగెత్తకూడదు. పక్కచూపులు చూడకూడదు.
👉 తలవంచుకొని పాదాల మీద మాత్రమే దృష్టి పెట్టాలి. మంత్రాన్ని మనసులో జపం చేస్తూ నెమ్మదిగా నడవాలి. రెండు చేతులలో కూడా జపమాల, పుష్పములు పట్టుకోవాలి. లేని యెడల రెండు చేతులు జోడించి పట్టుకోవాలి. అంతేకానీ, వాకింగ్‌కి పోయినట్లుగా వెళ్లకూడదు.
👉 నేటి కాలంలో కొందరు వాకింగ్ అన్న పేరిట పూర్వకాలంలో రుషులు ప్రదక్షిణలు చేయాలని చెప్పేవారండి అనీ చెబుతూ ఉంటారు.
👉ఆధ్యాత్మికపరమైన ఆలోచన వేరు, దైహిక పరమైన ఆధునిక దృష్టి వేరు అంటున్నారు.
👉 వాకింగ్ చేసే సమయంలో కొద్దిగా పెద్ద అడుగులు వేయాలి. అలాగే, చేతులు బాగా దూరంగా ఊపాలి. సైనికుల వలే మనం నడక నడవాలి. ఇందువల్ల ఆరోగ్యం చేకూరుతుంది. దీనికి పూర్తి వ్యతిరేకం ప్రదక్షిణ చేసే విధానం. నెమ్మదిగా నడవాలి. అడుగులో అడుగు వేసి నడవాలి. ఇదే ప్రదక్షిణలో దాగి ఉన్న నేపథ్యమని చెబుతున్నారు
- పల్నాడులో హత్య.. గోవాలో జాడ..! నిందితుల కోసం పోలీసుల షాకింగ్ ఆపరేషన్!
- కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్.. అతనితో ఆమెకి కూడా వివాహేతర బంధం! అనకాపల్లిలో ఘోరం..
- ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య! కారణం..?
- జలుబు చేసిందని RMP డాక్టర్ దగ్గరికి వెళ్తే.. ఏకంగా ప్రాణాలే పోయాయ్!
- సిని ఫక్కీలో చేజింగ్.. చైన్ స్నాచర్లను పట్టుకున్న సరిహద్దు గ్రామస్తులు..! మహిళ సహా..
- ‘చనిపోయిన 7 నిమిషాల తర్వాత కూడా మెదడు పనిచేస్తుందట.. అప్పుడూ నీ గురించే ఆలోచిస్తా..!’
- Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్‌కు వెళ్లింది.. కట్‌చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..
- అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం- ప్రొద్దుటూరులో అరుదైన నవగ్రహ మండపం విశేషాలివే!
- తల్లి మృతిని తట్టుకోలేక.. భార్యను చంపి భర్త ఆత్మహత్య
- లాయర్ అయితే నాకేంటి.. చంపకుండా ఇక్కడి నుంచి వెళ్లను!’









