అల్లూరి సీతారామరాజు జిల్లాలో లంచం తీసుకున్నాడని ఓ ఎస్ఐపై వచ్చిన ఆరోపణలపై పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. లంచం తీసుకొని ఎస్ఐ నిందితులను వదిలిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ ఎస్ఐను సస్పెండ్ చేశారు.
గంజాయి నిర్మూలించి స్మగ్లర్ల భరతం పట్టాలని ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తుంటే.. కొంతమంది అవినీతి అధికారులు లంచాలు తీసుకుంటూ పట్టుబడుతున్నారు. బాధ్యతలు మరచి.. లంచం కోసం చేయి చేస్తున్నారు. కేసు పెట్టకుండా ఉండాలంటే లక్ష ఇవ్వాల్సిందే.. లేకుంటే తీవ్రమైన కేసుల్లో ఇరుక్కోవాల్సిందే అని బేరం మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి ఘటన అల్లూరి జిల్లాలో ఘటన చోటుచేసుకుంది. లంచగొండి అవినీతి అధికారి వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా.. ఎస్పీ నివేదికతో డీఐజీ యాక్షన్ అప్లై చేశారు. ఆ అవినీతి ఎస్ఐను సస్పెండ్ చేశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు పోలీస్‌స్టేషన్‌లోని ఎస్ఐ కె.రామకృష్ణ గంజాయి వ్యాపారులతో సహకరిస్తున్నందుకు సస్పెన్షన్‌కు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. జూలై 4న 20 కేజీల గంజాయితో పాటు ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. ఆ సమయంలో ఎస్ఐ రామకృష్ణ.. స్మగ్లర్లతో బేరాలు మొదలు పెట్టాడు. లంచం ఇస్తే కేసు నమోదు చేయకుండా వదిలేస్తానని ఆఫర్ చేశాడు. చివరకు బేరం కుదిరింది. ఆన్లైన్ చెల్లింపుల ద్వారా నిందితుల నుండి రూ.1,25 లక్షలు లాగేసాడు. గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని విడిచి పెట్టేసాడు. దీనిపై ఆరోపణలు రావడంతో.. పోలీసులు విచారణ ప్రారంభించారు. అల్లూరి జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా దీనిపై దృష్టిసారించి ఎస్సై రామకృష్ణ పాత్ర ఉందని నిరూపించారు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ నిజమేనని.. డబ్బులు తీసుకొని నిందితులను వదిలేసినట్టు గుర్తించారు. ఒక నివేదికను డీఐజీ గోపీనాథ్ జెట్టికి ఎస్పీ అందించారు. దీంతో అవినీతి ఎస్ఐ రామకృష్ణను డీఐజీ సస్పెండ్ చేశారు.
Also read
- తిరుపతిలో విషాదం.. ఇద్దరు యువకులను ఉపిరాడకుండా చేసిన సెల్‌ఫోన్..!
- మేకలు కాసుకుంటున్న మహిళను పొదాల్లో లాక్కెళ్లిన దుండగుడు.. ప్రతిఘటించడంతో దారుణం..!
- ఛీ.. ఛీ మరీ ఇంతకు దిగజారాలా? లోన్ కట్టలేదని.. బాధితురాలి 10వ తరగతి కూతురి ఫోటోలతో..
- నేటి జాతకములు 10 సెప్టెంబర్, 2026
- Hyderabad: ఇంట్లో గడియ పెట్టుకుని బయటకు రాని లేడీ డాక్టర్.. తొంగి చూసి అంతా షాక్!





