నడిగూడెం: మంత్రాలు చేస్తుందనే అనుమానంతో
వృద్ధురాలిని హత్య చేసిన ఘటన అనంతగిరి మండలం త్రిపురవరం గ్రామంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. నడిగూడెం ఎస్సై జి. అజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… నడిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని త్రిపురవరం గ్రామానికి చెందిన కొమ్ము అలివేలమ్మ (70) భర్త నరసయ్య పశువులు కాపరిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు.
అలివేలమ్మ మంత్రాలు వస్తాయనే అనుమానంతో
గ్రామానికి చెందిన హుస్సేన్ మరో వ్యక్తితో కలిసి
అలివేలమ్మ మెడకు తాడును బిగించి హత్య చేసినట్లు మృతురాలి మనవడు సాయికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతురాలి కుమారుడు రాంబాబు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తుండగా కోడలు రాధ గ్రామంలో అంగన్వాడీ టీచర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.
Also read
- Telangana: అయ్యో దేవుడా.. పెళ్లైనా 6 నెలలకే ఇంత దారుణమా.. శాడిస్ట్ భర్త వేధింపులతో..
- Delhi Blast: కారు ఓనర్ పుల్వామా నివాసి.. ఢిల్లీ పేలుడు కేసులో సంచలన విషయాలు..
- Delhi Blast: అల్ ఫలా యూనివర్సిటీ నీడలో టెర్రరిస్టులు.. మొత్తం ఆరుగురు డాక్టర్లు అరెస్ట్!
- ఢిల్లీ కారు పేలుడు కేసులో కీలక పురోగతి.. డాక్టర్లుగా పని చేస్తూ.Delhi blast Latest updates
- Delhi Blast: ఎర్రకోట దగ్గర పార్కింగ్‌లో 3 గంటలు వెయిటింగ్.. ఆ సూసైడ్ బాంబర్ ఇతనే..





