నెల్లూరు: వైసీపీ నేత వేధింపులతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన నెల్లూరు జిల్లా సంగం మండలం పడమటిపాలెంలో జరిగింది. పంట వేసేందుకు వైకాపా జడ్పీటీసీ భర్త ప్రసాదౌడ్.. కానిస్టేబుల్ రమేశ్కు అప్పు ఇచ్చారు. వర్షాలకు పంట నష్టపోవడంతో అప్పు తీర్చలేకపోయాడు. దీంతో ప్రసాద్ గౌడ్ అప్పు తీర్చాలని రమేశ్ ను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. దీంతో వేధింపులు తాళలేక రమేశ్ మంగళవారం లేఖ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు