లీజుకు తీసుకున్న భూమితో పాటు ప్రభుత్వ స్థలంలో నాయకుడొకరు తవ్వకాలు చేపట్టారు. ఆయన క్వారీతో పాటు క్రషర్‌ను అధికారులు సీజ్ చేసి, భారీ మొత్తంలో జరిమానా విధించారు.
కదిరి పట్టణం, : లీజుకు తీసుకున్న భూమితో పాటు ప్రభుత్వ స్థలంలో నాయకుడొకరు తవ్వకాలు చేపట్టారు. ఆయన క్వారీతో పాటు క్రషర్‌ను అధికారులు సీజ్ చేసి, భారీ మొత్తంలో జరిమానా విధించారు.
శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కుటాగుళ్ల రెవెన్యూ గ్రామంలోని 3.843 హెక్టార్ల భూమిని వైకాపా నాయకుడు రమేశెడ్డి, ఆయన కుమారుడు సాయిప్రణీత్‌రెడ్డి.. శివసాయి కన్స్ట్రక్షన్ పేరిట లీజుకు తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ విస్తీర్ణంలో క్వారీ కోసం తవ్వకాలు చేపట్టినట్లు ఫిర్యాదులు అందడంతో ఆది, సోమవారాల్లో మైనింగ్ ఏడీ రామమోహన్‌రావు, సిబ్బంది తనిఖీలు చేశారు. ప్రభుత్వ భూమిలో తవ్వకాలు చేపట్టినట్లు గుర్తించి క్వారీతో పాటు క్రషర్‌ను సీజ్ చేశారు. రూ.12.89 కోట్ల జరిమానా విధించారు.
Also read
- రెండేళ్ల పసికందుపై.. కసాయి తండ్రి దారుణం
- ఆ ఊర్లో అర్ధరాత్రి ఇళ్లపై రాళ్ల వర్షం.. భయంతో వణికిపోతున్న జనాలు! అంతుచిక్కని మిస్టరీ..
- బీచ్‌లో కొట్లాట.. కట్ చేస్తే.. బయటపడ్డ ఎప్పుడో జరిగిన హత్య కేసు మిస్టరీ..!
- ఒంటరి మహిళలే టార్గెట్! వృద్ధురాలి మెడలోంచి 5 తులాల బంగారం చోరీ.. సీసీ కెమెరాలో దృశ్యాలు
- బ్యాంక్ అధికారులమంటూ బురిడీ.. క్రెడిట్ కార్డు యాక్టివేషన్ పేరుతో నిండా ముంచేశారు!





