కర్ణాటక: హుబ్లీలో నేహా హిరేమఠ్ (21) హత్య కేసులో రోజూ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. నిందితుడు ఫయాజ్ (23) ఆమెను కాలేజీ ఆవరణలోనే ఈ నెల 18న మధ్యాహ్నం కత్తితో విచక్షణా రహితంగా పొడిచి హత్య చేయడం తెలిసిందే. హత్య దృశ్యాలు సీసీ కెమెరాలలో కూడా రికార్డయ్యాయి. నేహాను కత్తితో 9 సార్లు పొడిచినట్లు మొదట్లో అందరూ భావించారు. కానీ 14 సార్లు పొడిచినట్లుగా పోస్టుమార్టం నివేదికలో తెలిపారు. గొంతుపై పలుసార్లు పొడవడంతో రక్తనాళాలు తెగిపోయాయి. అంతేగాక గుండెల మీద కూడా పొడవడంతో ఆ అభాగ్యురాలు నిమిషాల్లోనే ప్రాణాలు వదిలింది.
పశ్చాత్తాపమే లేదు
బుధవారం ఫయాజ్‌ని అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు కాలేజీకి తీసుకెళ్లి సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు. హత్య జరిగి వారంరోజులు గడుస్తున్నా నిందితుని ముఖంలో బాధ, ఎలాంటి పశ్చాత్తాపం లేదని, విచారణలో నిర్భీతిగా ఉన్నాడని సీఐడీ వర్గాలు తెలిపాయి. తాను ప్రేమించిన అమ్మాయి వేరే ఎవరికీ దక్కరాదన్న అక్కసుతో హత్యకు ఒకరోజు ముందు ధార్వాడలో కత్తిని కొన్నట్లు చెప్పాడు. కొన్నిరోజులుగా నేహా రాకపోకల మీద నిఘా వేశాడు. ఆ రోజు ప్రాక్టికల్ పరీక్షలు ఉండటంతో గంట ముందుగానే కాలేజీ క్యాంపస్‌లో కాపు కాసి రాగానే వికృతంగా దాడి చేశాడు.
Also read
- Telangana: ఆధార్ కార్డు అప్డేట్ చేస్తామంటూ.. ఇంట్లో మొత్తం దోచేశారు..
- ప్రముఖులతో ఫొటోలు.. చేతిలో ఫేక్ ఐడీ.. డీఐజీ అంటూ భార్యాభర్తల లక్షల దందా!
- అన్నం పెట్టిన బ్యాంకుకే కన్నం.. రూ. 90 లక్షల బంగారం మాయం! ఎవరో తెలిసి షాక్!
- డేటింగ్ యాప్‌లో పరిచయం..ఎంగేజ్మెంట్తో అసలు గుట్టు రట్టు! కట్‌చేస్తే పోలీసుల రంగప్రవేశం
- వారఫలాలు: ఆ రాశుల వారికి ఇక తిరుగులేదు.. ఏ పనిచేసినా సక్సెసే.. ఇందులో మీ రాశి ఉందా..?





