మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇండియన్ బ్యాంకులో బంగారం మాయం ఘటన కలకలం రేపింది.. అదే బ్యాంకులో పనిచేసే అసిస్టెంట్ మేనేజర్ బంగారం మాయం చేసినట్లు ఆడిట్‌లో తేల్చారు. బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు బాగోతం బయటపడింది. దొంగిలించిన బంగారం ఏం చేశాడో తెలుసా..!
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇండియన్ బ్యాంకులో ఖాతాదారులు తాకట్టు పెట్టిన అపహరణకు గురవడం సంచలనం రేపింది.. ఆడిట్‌లో బంగారం మాయం అయినట్లు గుర్తించిన బ్యాంక్ అధికారులు పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో అసలు బాగోతం బయటపడింది.
ఈ బ్యాంక్ లో బంగారు ఆభరణాలను తాకట్టుపెట్టి రుణాలు తీసుకున్న 22 మంది ఖాతాదారులకు చెందిన 700 గ్రాముల బంగారు ఆభరణాలు మాయం అయ్యాయి. ఇదే బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న రాజేష్ అనే ఉద్యోగి గుట్టు చప్పుడు కాకుండా మాయం చేశాడు.చోరీ చేసిన బంగారు ఆభరణాలను మరో ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టుపెట్టి రుణాలు తీసుకున్నాడు. ఆ డబ్బును తన సొంత అవసరాలకు వాడుకున్నాడని విచారణలో తేలింది. అపహరణకు గురైన బంగారం విలువ సుమారు 90 లక్షల రూపాయలు ఉంటుందని బ్యాంక్ అధికారులు, పోలీసులు గుర్తించారు
ప్రతి నెల బ్యాంక్ మేనేజర్ పర్యవేక్షణలో బాగంగా నిర్వహించే తనిఖీల్లో ఈ చోరీ విషయం బయటపడింది. చోరీ విషయం తెలుసుకున్న బ్యాంకు మేనేజర్ మహబూబాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పట్టణ సీఐ రఘుపతిరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అసిస్టెంట్ మేనేజర్ రాజేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు
ఇంట్లో దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అన్నట్లు గుట్టుచప్పుడు కాకుండా బంగారం మాయం చేసిన ఆ ఇంటిదొంగను వెంటనే పట్టుకుని ఖాతాదారులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. బ్యాంక్ అధికారులు మాత్రం ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బంగారం భద్రంగా ఉందని బరోసా కల్పిస్తున్నారు.. బంగారం మాయం చేయడం ఇదే ప్రమాదమా..! గతంలో కూడా ఇదే తరహాలో మోసానికి పాల్పడ్డాడా పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
Also read
- ఛీ.. ఛీ మరీ ఇంతకు దిగజారాలా? లోన్ కట్టలేదని.. బాధితురాలి 10వ తరగతి కూతురి ఫోటోలతో..
- నేటి జాతకములు 10 సెప్టెంబర్, 2026
- Hyderabad: ఇంట్లో గడియ పెట్టుకుని బయటకు రాని లేడీ డాక్టర్.. తొంగి చూసి అంతా షాక్!
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?





