రౌడీలు పోకిరీలకు అడ్డాగా మారిపోయిన గూడూరు పట్టణం
తిరుపతి సిటీ : తిరుపతి జిల్లా గూడూరులో జరిగిన ఆంజనేయస్వామి జెండా ఉత్సవంలో పోకిరీల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పట్టణంలో పలు చోట్ల అర్థరాత్రిలో జండాల ఉత్సవాల్లో జరిగిన ఘర్షణల్లో ముగ్గురు యువకులను ప్రత్యర్ధులు కత్తులతో పొడిచారు. ఈ కత్తి పొట్లలో యశ్వంత్, హరీష్ అబ్దుల్ అనే యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వీరిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరు తరలించారు. కత్తిపోట్లకు గురైన యువకులకు, నిందితులకు మధ్య పాత కక్షలు ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..





