Moinabad Drugs Case:ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో చాలామంది ప్రముఖులు ఉన్నట్లు తేలడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
మొయినాబాద్ డ్రగ్స్ కేసు కొత్త మలుపు
తెలుగు రాష్ట్రాల్లో సృష్టించిన రేపిన కేసుల్లో మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు ఒకటి. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు మూలాలు ఛేదించేందుకు ప్రత్యేక విచారణ బృందాన్ని-(సిట్) ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజేంద్రనగర్ డీసీపీ యోగేశ్ గౌతమ్ ఆధ్వర్యంలో సిట్ విచారణ మొదలు పెట్టనుంది.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ఫామ్స్లో ఈ పార్టీకి సంబంధించి లోతైన విచారణ చేపట్టనుంది సిట్. ఆ పార్టీకి ఎంతమంది హాజరయ్యారు? ఎవరెవరు వచ్చారు? డ్రగ్స్ తీసుకొచ్చిందెవరు? ఈ పార్టీ వెనుక అసలు కథేంటి? అనే కోణాల్లో విచారణ సాగనుంది. ఈ కేసులో సిట్ రంగంలోకి దిగిన విషయం తెలియగానే పట్టుబడినవారికి కొత్త టెన్షన్ మొదలైంది.
సిట్ ని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసిన డీజీపీ
ఈ కేసులో దుబాయ్స్ ఉన్న సంబంధాలపై ఆరా తీయనుంది స్పెషల్ విచారణ టీమ్. ప్రధాన నిందితుడిగా ఉన్న నమిత్ శర్మ రియల్ ఎస్టేట్ వ్యాపారాల కార్యకలాపాల ద్వారా మనీని ఎలా మళ్లించారనే దానిపై ఫోకస్ చేయనుంది. ఆయన అక్రమ సంపాదనకు సంబంధించి ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెట్టనుంది. ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయడంతో త్వరలోనే నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించనుంది.
ఈ కేసులో కొంతమంది రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉండటంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. స్విమ్మింగ్ పూల్ దగ్గర డ్రగ్తోపాటు మద్యం పార్టీ జరిగినట్లు ప్రస్తావించారు పోలీసులు. పార్టీకి హాజరైనవారు మద్యంతోపాటు డ్రగ్స్ తీసుకున్నట్లు విచారణలో అంగీకరించినట్టు ప్రస్తావించారు.
అందులో పట్టుబడినవారికి రెండోసారి పరీక్షలు చేసిన తర్వాత ఎంపీ పుట్టా మహేశ్ కుమారికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టు పేర్కొన్నారు. ఇక నమిత్ శర్మ మూడు రకాల డ్రగ్స్ తీసుకున్నట్లు బయటపడింది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, అర్జున్ రెడ్డిలు కొకైన్ తీసుకున్నట్లు రిపోర్టులో వెల్లడైంది. ఈ కేసులో ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టు వెల్లడించారు. మరి సిట్ విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో?
Also read
- రెండో తరగతి బాలికపై వృద్ధుడి అఘాయిత్యం
- రూ.25 లక్షలైనా ఇవ్వు, ఈ రాత్రికి ఇంటికైనా రా
- మొయినాబాద్ డ్రగ్స్ కేసు కొత్త మలుపు.. రంగంలోకి సిట్, వారంతా బుక్కయినట్టే
- ఉగాది, శ్రీ పరాభవ నామ సంవత్సరం.. మీన రాశి ఫలితాలు!
- 2026 ఉగాది రాశిఫలాలు.. కుంభ రాశి వారికి ఏలినాటి శని చివరి దశ.. ఆ సమస్యలు తప్పవు !





