కర్ణాటకలోని ఓ ఆయుర్వేద కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. అందులో చదవుకుంటున్న ఓ విద్యార్థినికి ప్రొఫెసర్‌తో అక్రమ సంబంధం ఉందని తోటి విద్యార్థులు పుకార్లు చేశారు.
కర్ణాటకలోని ఓ ఆయుర్వేద కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. అందులో చదవుకుంటున్న ఓ విద్యార్థినికి ప్రొఫెసర్‌తో అక్రమ సంబంధం(Illegal Affair) ఉందని తోటి విద్యార్థులు పుకార్లు చేశారు. దీంతో ఆ విద్యార్థిని సూసైడ్ చేసుకొని చనిపోవడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని మల్లాడిహళ్లిలో రాఘవేంద్ర ఆయుర్వేద కాలేజీ ఉంది. ఇందులో నిఖిత (22) అనే స్టూడెంట్(medical-student) బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసన్ అండ్ సర్జరీ (BAMS) ఫైనల్ ఇయర్ చదువుతోంది.
ఆ కాలేజీలో డాక్టర్ రాజు అనే లెక్చరర్‌తో నిఖిత చదువు విషయంలో చొరవగా మాట్లాడేది. దీంతో నిఖిత క్లాస్‌మెట్స్ కొందరు ఆమెకు, ఆ లెక్చరర్ మధ్య ఎఫైర్ ఉందని పుకార్లు పుట్టించారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడంతో పాటు పదేపదే ఆమెను అవమానించేలా మాట్లాడారంటూ నిఖిత తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు.
ఇలాంటి తప్పుడు మాటలను పట్టించుకోకుకండా చదువుపై ఫోకస్ పెట్టాలని తమ కూతురుకు ధైర్యం చెప్పామని అయినప్పటికీ తోటి విద్యార్థులు వేధించారంటూ వాపోయారు. ఆ మనస్థాపంతోనే నిఖిత ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురు గదిలో సూసైడ్ లేటర్ కూడా దొరికిందని.. అందులో తన మరణానికి కారణమైన విద్యార్థుల పేర్లు చెప్పిందని చెప్పారు. వాళ్లపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also read
- ఆలయాల్లో “భూతబలి” గురించి మీకు తెలుసా?
- Bachelor are Husband : బ్రహ్మచారి భార్య లేని భర్త……… దైవ కార్యాలకి పనిచేయడా..?
- మరో రెండు నెలలు వారికి అన్ని శుభ యోగాలే..! ఇందులో మీ రాశి ఉందా?
- Hindu Belief: గుడి మెట్లపై కూర్చోవడం శుభమా? అసలు నిజం ఏమిటి?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?




