పీఎం విశ్వకర్మ యోజన పథకం గురించి..
అఖిల భారతీయ విశ్వకర్మ తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ శ్రీరామ్ మహిపాల్ చారి… మాట్లాడుతూ..
చేతివృత్తుల వారిని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సుమారు మూడు సంవత్సరాల కిందట చాలా ప్రతిష్టాత్మకంగా ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు.. దీనిపైన మా నిరుపేద విశ్వకర్మ సోదరులు చాలా ఆశలు పెట్టుకున్నారు కానీ అన్ని స్కీముల మాదిరిగానే ఈ స్కీం కూడా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదు .ఈ స్కీం కోసం మా నిరుపేద విశ్వకర్మలు చాలా ఎదురు చూసిన నిరాశ మిగిలింది .ఇందులో భాగంగా టూల్ కిట్లు అందని వారు చాలామంది ఉన్నారు.. ఒకవేళ టూల్ కిట్ అందిన వారు కూడా బ్యాంకు లోన్ కోసం వెళితే బ్యాంక్ అధికారులు కనీసం స్పందించడం లేదు. లోన్ ఇవ్వకుండా రిజెక్ట్ చేసిన సందర్భాలు అనేకం. ఈ స్కీం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నా గాని అధికారుల నిర్లక్ష్యం వలన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది .. కావున కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ స్కీంకు సంబంధించిన అధికారులు మరియు బ్యాంక్ అధికారులకి తగు సూచనలు ఇచ్చి టూల్ కిట్టు మరియు బ్యాంకు లోను ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అఖిలభారతీయ విశ్వకర్మ తరపున విజ్ఞప్తి చేస్తున్నాము.. ఇందులో పాల్గొన్న వేల్పూర్ విశ్వకర్మ మండల అధ్యక్షుడు నూనె గంగాధర్ చారి మరియు సుంకం విష్ణు చారి ముట్టుకు నారాయణ చారి. శ్రీరాం ప్రశాంత్. ముట్టుకు నాగేంద్ర చారి .చరణ్ చారి. తదితరులు పాల్గొన్నారు…
Also read
- Telangana: ఆధార్ కార్డు అప్డేట్ చేస్తామంటూ.. ఇంట్లో మొత్తం దోచేశారు..
- ప్రముఖులతో ఫొటోలు.. చేతిలో ఫేక్ ఐడీ.. డీఐజీ అంటూ భార్యాభర్తల లక్షల దందా!
- అన్నం పెట్టిన బ్యాంకుకే కన్నం.. రూ. 90 లక్షల బంగారం మాయం! ఎవరో తెలిసి షాక్!
- డేటింగ్ యాప్‌లో పరిచయం..ఎంగేజ్మెంట్తో అసలు గుట్టు రట్టు! కట్‌చేస్తే పోలీసుల రంగప్రవేశం
- వారఫలాలు: ఆ రాశుల వారికి ఇక తిరుగులేదు.. ఏ పనిచేసినా సక్సెసే.. ఇందులో మీ రాశి ఉందా..?





